శనివారం శ్రీ 3 శ్రీ మే శ్రీ 2025
9
ప్రసన్నాంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం
చిలకలూరిపేట: రజక కాలనీలోని ఈశాన్య ప్రసన్నాంజనేయస్వామి దేవాలయ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.
సార్వత్రిక ఆరోగ్య పరీక్షలు పూర్తి చేయండి
చినగంజాం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సార్వత్రిక ఆరోగ్య పరీక్షల సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ విజయమ్మ సూచించారు. శుక్రవారం చినగంజాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ప్రధానంగా మండలంలో నిర్వహిస్తున్న సార్వత్రిక ఆరోగ్య పరీక్షల సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని, సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. సార్వత్రిక ఆరోగ్య పరీక్షలకు సంబంధించి జిల్లాలో సర్వే మెరుగుగా ఉందని చినగంజాం మండలంలోని చినగంజాం–1 సెంటర్‌లో సిబ్బంది కొరత కారణంగా సర్వే వెనుకబడి ఉందని వేరే సెంటర్ నుంచి సిబ్బందిని ఏర్పాటుచేసి చేయాలని సూచించామన్నారు. నాన్ డిసీజ్ కమ్యూనిటీ సర్వేలో భాగంగా డయాబెటిస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్ వంటి రోగాలకు సంబంధించి ఏఎన్‌ఎంలు ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహిస్తారన్నారు. చినగంజాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సీహెచ్‌సీగా చేసి.. 30 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపి స్తామని తెలిపారు. జనాభా ప్రాతిపదికన ఆసుపత్రిని సీహెచ్‌సీగా మార్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. కుటుంబ సంక్షేమ ఆపరేషన్‌లు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎన్‌సీడీసీడీ కార్యక్రమ అధికారి డాక్టర్ లలితా రాజేశ్వరి, వైద్యాధికారి డాక్టర్ సాయి శ్రీచరణ్, హెడ్ నర్స్‌లు, ఏఎన్‌ఎంలు హెల్త్ ఎడ్యుకేటర్‌లు, హెల్త్ విజిటర్‌లు, చిరంజీవి, మురళి, ఆరోగ్య సిబ్బంది, 104 కంప్యూటర్ ఆపరేటర్ పొదిలి రాఘవ పాల్గొన్నారు.
చీరాలటౌన్: ఉత్కంఠ.. ఉద్వేగంతో సాగే ఐపీఎల్ క్రికెట్ పోటీలు కొందరికి ఉల్లాసం కలిగిస్తుంటే మరి కొందరికి మరణదండనగా మారుతోంది. క్రికెట్ బెట్టింగ్ భూతం చీరాల ప్రాంతంలో చెలరేగిపోతోంది. ఇంజినీరింగ్ విద్యార్థులు, రోజు వారీ కూలీలు సైతం బెట్టింగ్ ఊబిలో కూరుకుపోతున్నారు. ఇలా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. చీరాల పట్టణంలో ముంతావారి సెంటర్, కొట్ల బజారు, పేరాల తదితర ప్రాంతాల్లో భారీగా బెట్టింగ్‌లు జరుగతుండటం ఆందోళన కలిగిస్తోంది.
వేటపాలెం నుంచి ఈపూరుపాలెం వరకు పెద్ద ఎత్తున బుకీలుగా వ్యవహరించే ఏజెంట్లు కరెన్సీ వల విసురుతున్నారు. గతంలో ఒకేచోట సిట్టింగ్‌లు పెట్టుకోవడంతో పోలీసులకు సులభంగా చిక్కేవారు. ప్రస్తుతం వారి రూటు సప‘రేటు’ అయింది. బెట్ 365 అనే ఆన్‌లైన్ యాప్‌తో గేమ్ నడిపిస్తున్నారు. టీవీలో ఆట చూస్తూ ఫోన్ల ద్వారానే బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసుల నిఘాకు అందకుండా ఇంట్లోనే ఉంటూ బుకీ ఏజెంట్లు బెట్టింగ్ చేసే వారితో పందేలు కాయిస్తున్నారు. ప్రతి బంతికీ.. ప్రతి ఓవర్‌కు బెట్టింగ్ కాస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో పేదలు కూడా ఈ ఉచ్చులో చిక్కుకుని గిలగిల్లాడుతున్నారు.
చావు డప్పు మోగుతున్నా..
బెట్టింగ్ వల్ల గతంలో ఎంతోమంది అప్పుల పాలవడంతోపాటు ఆత్మహత్యలకు పాల్పడినట్లు రికార్డు లు స్పష్టం చేస్తున్నాయి. కాగా ఇటీవల బెట్టింగ్ డబ్బు చెల్లించలేని వారు దొంగతనాలకు పాల్పడటం సాధారణంగా జరుగుతోంది. అలాగే ఈ పద్ధతి మంచిది కాదు అని చెప్పిన భార్యను ఓ వ్యక్తి హత్య చేసిన ఉదంతాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి.
ఉదంతాలు ఇవిగో..
విచక్షణ మరిచాడు భార్యను హత మార్చాడు
● గత నెల ఈపురుపాలేనికి చెందిన ఒక వ్యక్తి బెట్టింగ్‌లో సుమారు రూ. లక్ష వరకు డబ్బు పోగొట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా భార్య భద్రపరిచిన రూ.20 వేలు కూడా వదిలించుకున్నాడు. ఇలా ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నించిన ఆరు నెలల బాలింత అయిన భార్యను కిరాతకంగా కొట్టి హతమార్చాడు. ప్రస్తుతం అతను జైల్లో ఉండగా.. తల్లి చనిపోవడంతో మూడు సంవత్సరాల పాప, ఆరు నెలల బాబు దగ్గరలోని వృద్ధ దంపతుల వద్ద ఆశ్రయం పొందుతున్నారు.
128 సవర్ల బంగారం కాజేశారు..
● చీరాల్లో సంచలనంగా మారిన 128 సవర్ల బంగారం, రూ.1.50 లక్షల నగదు కాజేసిన నిందితులు కూడా బెట్టింగ్ బానిసలే. ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా, మెకానిక్‌గా పనిచేస్తున్న ఇద్దరు యువకులు ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్‌లు వేసి లక్షలు నష్టపోయారు. అవి తీర్చడానికి వివిధ రకాల ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా అప్పులు తీసుకున్నారు. ఇక ఒత్తిడి పెరగడంతో ఓ ఇంట్లో దొంగతనం చేసి 128 సవర్ల బంగారం, రూ.1.50 లక్షల నగదు కాజేశారు. పోలీసులు గంటల వ్యవధిలోనే వారికి అరదండాలు వేసి జైల్లో కుక్కేశారు.
ఊరి నుంచి పరారీ
● ఈపురుపాలేనికి చెందిన ఒకరు, జాండ్రపేటకు చెందిన మరో వ్యక్తి క్రికెట్ బెట్టింగ్‌లో లక్షలు పోగొట్టుకున్నారు. అప్పులు చెల్లించలేక, ఇంట్లో వారిని ఇబ్బందులు పెట్టలేక ఎవరికీ చెప్పకుండా వేరే ఊరికి వెళ్లిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే చీరాల ప్రాంతంలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ బాధితుల సంఖ్య పెద్ద మెమరీ కార్డులా మారిపోతోంది.
న్యూస్‌రీల్
బెట్టింగ్ ఎలా కాస్తున్నారు?
బెట్టింగ్ కాసేవారు తమకు అనువుగా మ్యాచ్‌లను మార్చుకుంటున్నారు. టీవీ చూస్తూ ఓవర్‌లో ఎన్ని రన్స్ కొడతారు.. ఈ బంతి సిక్స్.. ఫోర్.. డబుల్ రన్....ఈ ఓవర్‌లో వికెట్ పడుతుంది.. ఇలా బెట్టింగ్‌లు కడుతున్నారు. టీవీల వద్ద కొందరు ఇలా పందేలు కాస్తున్నారు. అయితే బుకీ ఏజెంట్లు మాత్రం యువకులు, బంగారు వ్యాపారులు, వస్త్ర వ్యాపారుల వద్ద లక్షలాది రూపాయల పందేలు నిర్వహిస్తున్నారు. టాస్ మొదలుకొని ప్రతి బంతికి ఎన్ని రన్స్ కొడతారు.. ఎన్ని వికెట్లు తీస్తారు.. ఏ వికెట్ ఎప్పుడు పడుతుందో అని ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు. కంప్యూటర్‌తో పాటు ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు బుకీల ద్వారా సమాచారం తెలుసుకుని స్థానికంగా బెట్టింగ్‌లు వేస్తున్నారు. వీరంతా బుకీలకు ఏజెంట్లుగాను, చిన్న బుకీలుగా వ్యవహరిస్తున్నారు. నమ్మకంగా ఉంటూ పందేలు కాసేవారిని ఏర్పాటు చేసుకుంటున్నారు.
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల