కూలిన మురుగు కాల్వ కల్వర్టు | - | Sakshi
Sakshi News home page

కూలిన మురుగు కాల్వ కల్వర్టు

May 3 2025 7:58 AM | Updated on May 3 2025 7:58 AM

కూలిన

కూలిన మురుగు కాల్వ కల్వర్టు

నగరం: పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం రైతుల పాలిట శాపంలా మారింది. రేపల్లె ప్రధాన మురుగు కాల్వ న్యూకోర్స్‌కు మురుగు నీటిని పంపే వీరయ్య మురుగు కాల్వ చివర కల్వర్టు శిఽథిలమై కూలింది. సుమారు 1500 ఎకరాల పంట పొలాలు ముంపునకు గురై పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. గతేడాది జూన్‌, జులైలో కురిసిన వర్షాలకు వీరయ్య మురుగు కాల్వ నుంచి రేపల్లె ప్రధాన మురుగుకాల్వ న్యూకోర్స్‌కు కలిపే కల్వర్టు కూలింది. దీంతో ఆర్‌ఎం డ్రెయిన్‌ నుంచి వచ్చిన నీటి ఉధృతికి వందలాది ఎకరాలలో వరి పంట నీటిపాలై తీవ్ర నష్టం వాటిల్లింది. రైతులు అధికారులు దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో తమ సొంత డబ్బులతో రైతులు కూలిన కల్వర్టుకు ఇసుక బస్తాలు వేసి ఆర్‌ఎం డ్రెయిన్‌ నుంచి నీరు రాకుండా చర్యలు చేపట్టారు. అప్పటి నుంచి రైతులు అధికారులు, పాలకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా పట్టించుకునే వారే కరువయ్యారు.

అధికారుల వింత వాదన

రేపల్లె ప్రధాన మురుగు కాల్వ న్యూకోర్స్‌ (ఆర్‌ఎం డ్రెయిన్‌) నుంచి వీరయ్య మురుగుకాల్వకు ఏర్పాటుచేసిన కల్వర్టు డ్రెయినేజీ శాఖ పరిఽధిలో లేదని ఆ శాఖ అధికారులు చెబుతుండడంతో రైతులు విస్మయం చెందుతున్నారు. 20 ఏళ్ల కిందట కల్వర్టు నిర్మించారని అప్పటి నుంచి ఆర్‌ఎం డ్రెయిన్‌ నుంచి నీరు పంటపొలాల్లోకి రాకుండా లాకులు కిందకు దించేవారమని రైతులు చెబుతున్నారు. 2024 జూన్‌లో కురిసిన వర్షాలకు కల్వర్టు, లాకు సిస్టమ్‌ పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు చెబుతున్నారు. డ్రెయినేజి పరిధిలో లేకపోతే గతంలో కల్వర్టు నిర్మించి లాకుల సిస్టమ్‌ ఎలా ఏర్పాటు చేశారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి వీరయ్య మురుగు కాల్వపై కల్వర్టు నిర్మించి లాకుల సిస్టమ్‌ ఏర్పాటుచేయాలని రైతులు కోరుతున్నారు.

గతేడాది జూన్‌లో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న కల్వర్టు పట్టించుకోని పాలకులు, డ్రెయినేజి అధికారులు కల్వర్టు నిర్మించి లాకులు ఏర్పాటు చేయాలని కోరుతున్న రైతులు

కల్వర్టు నిర్మించాలి

ఆర్‌ఎం డ్రైయిన్‌ నుంచి నీటిప్రవాహం వీరయ్య మురుగు కాల్వలోకి రాకుండా ఏర్పాటుచేసిన కల్వర్టు కూలిపోవడంతో లాకుల సిస్టమ్‌ దెబ్బతింది. దీంతో పంట పొలాలు ముంపునకు గురై అపార నష్టం వాటిల్లింది. అధికారులు స్పందించి కల్వర్టు నిర్మించి లాకుల సిస్టమ్‌ ఏర్పాటుచేయాలి.

– మత్తి రాధాకృష్ణ, రైతు

బాధలు అర్థం చేసుకోండి

గతేడాది జూన్‌లో కురిసిన భారీ వర్షాలకు వీరయ్య మురుగు కాల్వపై ఉన్న కల్వర్టు కూలింది. వరి పంటకు అపార నష్టం వాటిల్లింది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. కల్వర్టు నిర్మించి లాకుల సిస్టమ్‌ ఏర్పాటుచేయకపోతే మరలా పంట దెబ్బతినే అవకాఽశముంది. మా బాధలు అర్థం చేసుకుని పాలకులు, అధికారులు తర్వితగతిన కల్వర్టు నిర్మాణం చేయాలి.

– పూషడపు సాంబశివరావు, రైతు

కూలిన మురుగు కాల్వ కల్వర్టు1
1/3

కూలిన మురుగు కాల్వ కల్వర్టు

కూలిన మురుగు కాల్వ కల్వర్టు2
2/3

కూలిన మురుగు కాల్వ కల్వర్టు

కూలిన మురుగు కాల్వ కల్వర్టు3
3/3

కూలిన మురుగు కాల్వ కల్వర్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement