తాడేపల్లిరూరల్: సీతానగరంలోని విజయకీలా ద్రి దివ్య క్షేత్రంపై శుక్రవారం తిరునక్షత్ర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళ శాసనాలతో 1008వ భగవద్రామానుజాచార్య స్వామి వారి తిరునక్షత్ర మహోత్సవంలో భాగంగా ఉదయం 9 గంటలకు అభిషేకం, సేవాకాలం, అర్చన కార్యక్రమాలు, సాయంత్రం 6 గంటలకు వాహన సేవ, తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామన్నారు. భక్తులు అధిక సంఖ్యల పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు.
శాప్ ఆధ్వర్యంలో
కబడ్డీ క్యాంప్
వినుకొండ: శాప్ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ వరకు కబడ్డీ క్యాంప్ స్థానిక కారంపూడి రోడ్డులోని విద్యావికాస్ హైస్కూల్‌లో నిర్వహిస్తున్నట్టు కోచ్ కోమటిగుంట శ్రీహరి తెలిపారు. ఈ క్యాంప్‌ను శుక్రవారం డీసీ చైర్మన్ గంగినేని రాఘవరావు, ఎస్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రజిత్‌యాదవ్, పీఈటీ రాధాకృష్ణమూర్తి, వినుకొండ జోన్ ప్రెసిడెంట్ గణప వీరాంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా కబడ్డీ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 8008285430 నంబరులో సంప్రదించాలన్నారు.
యతీశ్వరుల
చిత్ర పటాలతో ప్రదర్శన
కొల్లూరు: శంకర జయంతిని పురస్కరించుకుని ఆది శంకరాచార్యులు, రామచంద్రేంద్ర సరస్వ తి యతీశ్వరులు చిత్రపటాలతో కొల్లూరులో శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు. వేద పరీక్షలు, పండిత సన్మాన సభలు శుక్రవారం నుంచి నాలుగు రోజులపాటు కొల్లూరులోని శ్రీ పార్వతీ సంస్కృత పాఠశాలలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నా రు. కార్యక్రమాల నిర్వహణకు అధ్యక్ష, కార్య ద ర్శులుగా గబ్బిట శివరామకృష్ణప్రసాద్, తాడేప ల్లి వెంకటసింహాద్రిశాస్త్రి వ్యవహరిస్తారన్నారు.
7 నుంచి కళాపరిషత్ నాటిక పోటీలు
పొన్నూరు: పొన్నూరు కళాపరిషత్ ఆధ్వర్యంలో బుర్రకథ పితామహుడు పద్మశ్రీ షేక్ నాజర్ శత జయంతిని పురస్కరించుకుని 24వ తెలుగు రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్టు కళాపరిషత్ కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం కార్యక్రమాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ నెల 7వ తేదీ నుంచి 10 వరకు నిడుబ్రోలు జెడ్పీ హైస్కూల్ ఆవరణలోని డాక్టర్ నన్నపనేని జ్ఞానేంద్రనాఽథ్ కళావేదికపై పోటీలు జరుగుతాయన్నారు. ఎస్.ఆంజనేయులునాయుడు, ఎన్. రఘునాఽథ్, ఆకుల సాంబశివరావు, ఎం.విజయ్‌కుమార్ రెడ్డి, డాక్టర్.దేసిబాబు, మురళీకృష్ణ, జి.తాతారావు, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా
ఆదిశంకరాచార్య జయంతి
అమరావతి: అమరేశ్వరుని దేవస్థానంలో శుక్రవారం ఆదిశంకరాచార్య జయంతిని ఘనంగా నిర్వహించారు. శంకరాచార్య విగ్రహనికి ఆలయ అర్చకుడు శంకరమంచి రాజశేఖర శర్మ పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం విశేషాలంకారం, ప్రత్యేక పూజలు చేసి బ్రాహ్మణులకు విసన కర్రలు, మామిడి పండ్లు పంపిణీ చేశారు.
విజయకీలాద్రిపై తిరునక్షత్ర మహోత్సవం
విజయకీలాద్రిపై తిరునక్షత్ర మహోత్సవం