బోటింగ్ షికార్‌తో మినీ గోవాగా మారే అవకాశం
బాపట్ల జిల్లాలోని రామాపురం, సూర్యలంక తీరాల్లో బోటింగ్ జూలై నుంచి బోటింగ్ ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. బోట్ షికారు అమల్లోకి వస్తే చీరాల, బాపట్ల తీరాలకు పర్యాటకులు పోటెత్తుతారు. జిల్లాలోని సూర్యలంక, వాడరేవు, రామాపురం సముద్ర తీరప్రాంతాలకు ఏపీలో చాలా జిల్లాలతోపాటుగా తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు అధికంగా వస్తారు. కార్తీక మాసంలో అధికంగా పర్యాటకులు వస్తుంటారు. అంతేగాక సినిమా షూటింగ్‌లకు చీరాల తీరం బాగా అనుకూలం, సినీ తారలకు నచ్చేలా రిసార్టులు, ప్రొడ్యూసర్లకు ఖర్చు తక్కువలో సినిమా చిత్రీకరణ చేసేలా మంచి లోకేషన్లు కూడా ఉన్నాయి. బోటింగ్ కూడా అందుబాటులోకి వస్తే మినీ గోవాగా రూపాంతరం చెందుతుంది.


