చీరాల రూరల్: రైలు ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చీరాల రైల్వేస్టేషన్ వద్ద గల ఫైరాఫీసు గేటు సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య తెలిపిన వివరాల మేరకు... రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడనే సమాచారంతో సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి ఎస్సై పరిశీలించారు. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. మృతుని వయస్సు 50 – 55 సంవత్సరాలు ఉంటుందని, 5.6 అడుగుల ఎత్తు, ఛామన ఛాయ రంగు, మెడమీద పుట్టుమచ్చ, కుడికాలు తొడమీద మరో పుట్టుమచ్చ ఉన్నట్లు చెప్పారు. శరీరంపై ఎరుపురంగుపై తెల్ల పెద్దగడులు గల నిండు చేతులు చొక్కా, డార్క్ రంగు ప్యాంటు ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 94406 27646 నంబర్‌కు సమాచారం అందించాలని ఆయన సూచించారు.
మరో ప్రమాదంలో ...
రైలు ఢీకొన్న ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చీరాల–వెదుళ్లపల్లి రైల్వే స్టేషన్‌ల మధ్య చోటుచేసుకుంది. ఎస్సై సీహెచ్. కొండయ్య తెలిపిన వివరాల మేరకు... రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడనే సమచారంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించగా మృతుని వద్ద ఎలాంటి ఆధారాలూ లభించలేదని చెప్పారు. మృతుని వయస్సు 50 – 55 సంవత్సరాలు ఉంటాయని, 5.6 ఎత్తు, ఛామన ఛాయ రంగు కలిగి ఉన్నాడని పేర్కొన్నారు. మృతుని శరీరంపై వంకాయ రంగు, తెలుపు నలుపు గడులు కలిగిన చొక్కా, సిమెంట్ కలర్ జీన్స్‌ప్యాంటు ఉన్నట్లు వివరించారు. మృతుని మెడలో నలుపు, ఎరుపు కలిగిన పూసల దండ ఉందని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుని ఆచూకీ ఎవరికై నా తెలిసినట్లయితే 94406 27646 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.
రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి