ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Mar 20 2025 2:39 AM | Updated on Mar 20 2025 2:37 AM

బాపట్ల: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ పీటీడీ నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు పేర్కొన్నారు. యూనియన్‌ ముఖ్యనాయకుల సమావేశం స్థానిక కోన భవన్‌లో బుధవారం జరిగింది. శ్రీనివాసరావు మాట్లాడుతూ కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, పాత పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని, ఖాళీలకు ప్రమోషన్‌ ద్వారా భర్తీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు శ్రీనివాసరాజు, వి.పూర్ణచంద్రరావు, ఎ.రాంమోహన్‌రావు, టి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

కరాటే పోటీల విజేతలకు బహుమతులు

బాపట్ల: ఆలిండియా ఓపెన్‌ కరాటే చాంపియన్‌షిప్‌–2025 పోటీల్లో బాపట్ల విద్యార్థులు బంగారు, వెండి పతకాలు సాధించారని కోచ్‌ యర్ర నాగేశ్వరరావు పేర్కొన్నారు. బహుమతులు సాధించిన విద్యార్థులకు అభినందన సభ బుధవారం జరిగింది. యర్ర నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ మచిలీపట్నంలో జరిగిన పోటీల్లో బాపట్ల నుంచి జూనియర్‌ విభాగంలో గోల్డ్‌ మెడళ్లను పి.యశస్విన్‌, పి.రామ్‌ వరణ్య, సోనూ నాగసాయి, సిల్వర్‌ మెడల్‌ను సీహెచ్‌ జయంతిబాబు, బ్రాంజ్‌ మెడళ్లను వైష్ణవ్‌, కె. పర్ణిక సాయి గెలుచుకున్నారని తెలిపారు. గూడవల్లికి చెందిన గోల్డ్‌ నగలు ఎం. కార్తీక్‌, పి. బాలాజీ, సీహెచ్‌ కీర్తన, ఎ. నిత్య, హరి చరిత, గగన, ప్రశంస, అయేషా, కిషోర్‌, సిల్వర్‌ మెడల్స్‌ను పి. ఖుషి, సీహెచ్‌ ధన్య, ఎ. సోహిత, దీక్షిత, కీర్తన. బ్రాంజ్‌ మెడళ్లను కె.జయంతి, జె. సాన్విత గెలుచుకున్నారని తెలిపారు. ఈ టోర్నమెంట్లో టీం మేనేజర్లు వ్యవహరించిన అవినాష్‌, కరాటేలో బహుమతులు సాధించిన విద్యార్థులను పలువురు అభినందించారు.

క్వారీ గుంతలో పడి బాలుడు మృతి

కర్లపాలెం: అక్రమ సంపాదనే ధ్యేయంగా టీడీపీ చోటా నాయకులు అనఽధికారికంగా ఇసుక క్వారీ తవ్వి విక్రయించుకున్నారు. కానీ దానిని పూడ్చకుండా వదిలేయడంతో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి రెవెన్యూ పరిఽధిలో బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు యాజలి ఎస్సీ కాలనీకి చెందిన ఉన్నం కిషోర్‌ – అమృతమ్మల కుమారుడు ప్రవీణ్‌కుమార్‌(14) తన స్నేహితులతో కలిసి బుధవారం క్వారీ వద్దకు వెళ్లాడు. తర్వాత నీటిలో మునిగి మృతి చెందాడు. తోటి బాలురు వచ్చి విషయం తెలపటంతో గ్రామస్తులు గాలించారు. ప్రవీణ్‌కుమార్‌ మృతదేహం లభ్యమైంది. కన్నవారు విలపిస్తున్న తీరు స్థానికులను కూడా కంటతడి పెట్టించింది. అనధికారిక ఇసుక క్వారీని తహసీల్దార్‌ సుందరమ్మ, ఎస్‌ఐ రవీంద్ర పరిశీలించారు. బాలుడు మృతి చెందిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

పూర్వవిద్యార్థుల సహకారం అభినందనీయం

బాపట్ల: కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల పాత్ర అభినందనీయమని, వారి సహాయ సహకారాలు ప్రస్తుత విద్యార్థులకు ప్రేరణనిస్తాయని ఆచార్య ఎన్‌. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్‌ ఆర్‌. శారద జయలక్ష్మి దేవి అన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో నూతనంగా నిర్మించిన ఆలుమ్ని హౌస్‌ మొదటి అంతస్తును బుధవారం ప్రారంభించారు. డాక్టర్‌ ఆర్‌.శారద జయలక్ష్మి మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మించబడిన ఈ వసతి గృహం అతిథులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ పి. ప్రసూనరాణి కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల సహకరాన్ని అభినందించారు. కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా విశ్వవిద్యాలయ డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ డాక్టర్‌ పి.వి.సత్యనారాయణ, డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ ఎఫైర్స్‌ డాక్టర్‌ జి. కరుణాసాగర్‌, డీన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ డాక్టర్‌ సి.హెచ్‌. శ్రీనివాసరావు, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.రామచంద్రరావు, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది, పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

తాడేపల్లిరూరల్‌: కుటుంబ కలహాల నేపథ్యంలో ఈనెల 10న పురుగుల మందు తాగిన ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీసులు, మృతుని బంధువుల కథనం ప్రకారం.. తాడేపల్లికి చెందిన కిశోర్‌(32) మద్యానికి బానిసయ్యాడు. భార్య నాగేశ్వరితో తరచూ గొడవలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో నాగేశ్వరి తల్లి, సోదరుడు వచ్చి మాట్లాడారు. ఈ సందర్భంలో కిశోర్‌కు, వారికి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో నాగేశ్వరి తల్లి, సోదరుడు కిశోర్‌ కళ్లలో కారం కొట్టి దాడి చేశారు. మనస్తాపం చెందిన కిశోర్‌ ఈనెల 10న పురుగుల మందు తాగాడు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. అయితే భార్య, అత్త, బావమరిది వల్లే తన కొడుకు మరణించాడని కిశోర్‌ తల్లి బుజ్జి ఆరోపిస్తున్నారు. పెళ్లికి ముందు కిశోర్‌కు వ్యసనాలు లేవని, ఇంటర్నెట్‌లో పనిచేసేవాడని, ఇటీవల ఆ ఉద్యోగం మానివేయడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడని బుజ్జి వివరించారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, సర్దిచెప్పాల్సిన అత్త, బావమరిది కళ్లలో కారం కొట్టి దాడి చేశారని, అందుకే తన కొడుకు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని, అయినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదని విమర్శించారు.

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి     1
1/3

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి     2
2/3

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి     3
3/3

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement