సత్తెనపల్లి: భార్యను వేధించిన కేసులో భర్తకు జైలు శిక్ష విధిస్తూ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి గౌస్ మొహిద్దీన్ మంగళవారం తీర్పు ఇచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెదకూరపాడు మండలం ముసాపురం గ్రామానికి చెందిన దాసరి రాజ్యలక్ష్మి 2017 నవంబర్ 1న తన భర్త రాంబాబు అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని గుంటూరు దిశా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై వాదోవాదనల అనంతరం మంగళవారం న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. రాజ్యలక్ష్మిని మానసికంగా, శారీరకంగా వేధించినందుకు రాంబాబుకు రెండు సంవత్సరాలు జైలు శిక్ష, రూ. 5వేలు అపరాధ రుసుం విధించారు. అదనపు కట్నం కోసం వేధించినందుకు ఆరు నెలలు జైలు శిక్ష, రూ.5 వేలు అపరాధ రుసుం విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ప్రసాద్ నాయక్ వ్యవహరించారు.