
శాస్త్రవేత్త డాక్టర్ గంగాదేవి
గుంటూరు రూరల్: రైతులు తొలకరిలో ముందస్తు యాజమాన్య పద్ధతులు చేపట్టి ఆరోగ్యకరమైన అధిక దిగుబడులను పంటల్లో సాధించవచ్చని లాంఫాం కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎం.గంగాదేవి తెలిపారు. శుక్రవారం నగర శివారుల్లోని కేవీకేలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రైతుకి దుక్కి నుంచి దిగుబడుల వరకు ఏది అవసరమో ముందుగా గుర్తుంచి పకడ్బందీ ప్రణాళిక పర్యవేక్షణ వల్లనే పంటదిగుబడి పెరిగి, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించగలరని తెలిపారు. రైతులకు ఇది ఖరీఫ్ సాగుగుకు సన్నద్ధమయ్యేందుకు సరైన సమయమని వివరించారు. ఖరీఫ్ పంటకాలం ప్రారంభంలో రైతులు వేసవి దుక్కులపై శ్రద్ధ పెట్టాలని కోరారు. భూసార పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. భూసారం పెంపునకు పశుగ్రాసాన్ని పచ్చిరొట్ట పైర్లు వేసుకోవాలని చెప్పారు. భూసార పరిరక్షణకు సేంద్రియ ఎరువులు ఎంపిక చేసుకోవాలని సూచించారు.