
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ రంజిత్‌బాషా, చిత్రంలో జేసీ శ్రీధర్
బాపట్ల: యువతలో నైపుణ్యాల మెరుగుకు, ఉపాధి అవకాశాల కల్పనకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా సూచించారు. ఉపాధి కల్పన శాఖ, నైపుణ్య అభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి కమిటీ తొలి సమావేశం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ
‘బాపట్ల ఆణిముత్యాలు‘ పేరుతో ప్రత్యేక పోర్టల్ రూపొందిద్దామని సూచించారు. నిరుద్యోగ యువత, పరిశ్రమల యాజమాన్యాలను ఒకేవేదికపైకి తీసుకొచ్చేలా పోర్టల్ ఉండాలని వివరించారు. పోర్టల్లో ఎప్పటికప్పుడు ఉద్యోగావకాశాలను నిక్షిప్తంచేయాలని చెప్పారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఆరు నైపుణ్య అభివృద్ధి హబ్‌లు ఉంటే అందులో రెండు మాత్రమే పనిచేస్తున్నాయని, మిగిలినవీ పనిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి జి.సుధాకర్, జిల్లా ఉపాధి కల్పనా అధికారి రమాదేవి, డీఆర్‌డీఏ పీడీ బి.అర్జున్‌రావు తదితరులు పాల్గొన్నారు.
జగనన్న కాలనీల్లో గృహనిర్మాణం
వేగవంతం చేయండి
జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణాలు, వివిధ సంక్షేమ కార్యక్రమాలపై డివిజన్, మండల, గ్రామ సచివాలయాల స్థాయిలోని అధికారులతో శుక్రవారం ఆయన వీడియోకాన్ఫరెన్సు నిర్వహించారు.
బాపట్ల ఆణిముత్యాల
పేరుతో ప్రత్యేక పోర్టల్
కలెక్టర్ రంజిత్‌బాషా