చిలకలూరిపేట టౌన్: ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి భవనాలు, గోదాములు నిర్మించిన వాటిని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు చేశారు. చిలకలూరిపేట మండలంలోని బొప్పూడి గ్రామంలోని మిట్టపల్లి పొగాకు గోదాముతో పాటు పట్టణంలోని సుభాని నగర్, గాంధీపేట, పాతసంత తదితర ప్రాంతాల్లోని హాస్పిటల్, స్కూల్, అపార్ట్‌మెంట్లను క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించినట్లు నిర్ధారించిన అధికారుల బృందం ఆయా భవనాల యజమానులు ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.