
ఉద్యాన పంటల ఉత్పత్తుల నిల్వ, గ్రేడింగ్, మార్కెటింగ్ చేసుకునేందుకు ఏర్పాటు చేయనున్న కలెక్షన్ సెంటర్లు రైతులకు చాలా ఉపయోగకరం. ఇప్పటికే జిల్లాలో కొల్లిపర, నందివెలుగు, కొత్తమల్లాయపాలెం, నుదురుపాడులో సెంటర్లు నిర్మించి ప్రారంభించాం. త్వరలో ప్రత్తిపాడులో నిర్మిస్తున్న కలెక్షన్ సెంటరును ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ముందుకు వస్తే మరిన్ని మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉద్యాన రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
– ఎన్.సుజాత, జిల్లా ఉద్యాన అధికారి