
గాలికుంటు వ్యాధి టీకా వాల్‌పోస్టర్లను ఆవిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్
బాపట్ల: పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా టీకా వేయించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పశుపోషకులకు సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం గాలికుంటు వ్యాధి నివారణ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు వ్యాధి నివారణ టీకా వేయించాలని సూచించారు. జిల్లాలో 25 మండలాల్లో 75 బృందాలను ఏర్పాటు చేయగా, వాటిలో 411 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఇప్పటికే 3,38,650 డోసుల టీకా పశువైద్యశాలలకు అందించామని జేడీఏ అబ్దుల్‌సత్తార్ తెలిపారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ కె.శ్రీనివాసులు, అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్