
● జాతీయ స్థాయిలో 64 ర్యాంకు కై వసం ● ర్యాంక్ కార్డు అందుకున్న చల్లా స్వప్న మాధురి
సత్తెనపల్లి: ఇంజనీరింగ్, సైన్‌నన్స్ కోర్సుల్లో ప్రతిభను గుర్తించేందుకు నిర్వహిస్తున్న గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) పరీక్షల్లో పల్నాడు జిల్లా సత్తెనపల్లి విద్యార్థిని సత్తా చాటింది. ఈ నెల 16న గేట్ ఫలితాలు విడుదలయ్యాయి. జాతీయ స్థాయిలో లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడి రాసే ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి 64 ర్యాంక్ కై వసం చేసుకుంది. గేట్‌లో ప్రతిభ చాటుకుంటే పబ్లిక్ సెక్టార్ కంపెనీల్లో కొలువు దగ్గడమే కాక, సీఎస్‌ఐఆర్ స్పాన్సర్డ్ ప్రాజెక్టుల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అందజేస్తారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీల్లో కొలువులు దక్కాలంటే గేట్‌లో అర్హత తప్పనిసరి. 67.67 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 64వ ర్యాంక్‌తో ప్రతిభ చూపిన స్వప్న మాధురిని, ఆమె తల్లిదండ్రులు చల్లా శ్రీనివాసరావు, అనురాధ దంపతులను పలువురు గురువారం అభినందించారు.