
శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి బ.నవమి రా.8.46 వరకు తదుపరి దశమి, నక్షత్రం పూర్వాషాఢ ప.3.40 వరకు తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం రా.11.14 నుండి 12.43 వరకు దుర్ముహూర్తం ఉ.6.04 నుండి 7.38 వరకు అమృతఘడియలు... ఉ.11.11 నుండి 12.43 వరకు.
సూర్యోదయం : 6.03
సూర్యాస్తమయం : 6.07
రాహుకాలం : ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుంచి 3.00 వరకు
మేషం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు.
వృషభం: పనుల్లో తొందరపాటు. బంధువులతో విభేదాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.
మిథునం: ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు దగ్గరవుతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
కర్కాటకం: దూరపు బంధువులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.
సింహం: పనులు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు పనిభారం.
కన్య: బంధువులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు.
తుల: కార్యజయం. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటుంది.
వృశ్చికం: శ్రమ తప్పదు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
ధనుస్సు: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
మకరం: మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
కుంభం: దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు.
మీనం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.