Daily Horoscope: ఈ రాశివారు ఎంతటి పనైనా వాయిదా వేయకతప్పదు

Today Horoscope In Telugu 26-02-2022 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి బ.దశమి ఉ.9.08 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం మూల ఉ.9.19 వరకు, తదుపరి పూర్వాషాఢ వర్జ్యం సా.6.14 నుండి 7.44 వరకు దుర్ముహూర్తం ఉ.6.24 నుండి 7.56 వరకు అమృతఘడియలు... రా.3.11 నుండి 4.41 వరకు.

సూర్యోదయం :    6.26
సూర్యాస్తమయం    :  6.01
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు
 

మేషం: ఎంతటి పనైనా వాయిదా వేయకతప్పదు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగుతాయి.

వృషభం: దూరప్రయాణాలు. ముఖ్య వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మిథునం: కార్యజయం. ఆస్తుల విషయంలో ఒప్పందాలు. ఆకస్మిక ధనలబ్ధి. పరపతి పెరుగుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త మార్పులు.

కర్కాటకం: ఇంట్లో వేడుకలు. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. స్థిరాస్తి వృద్ధి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

సింహం: కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత మందగిస్తాయి.

కన్య: రాబడికి మించిన ఖర్చులు. ప్రయాణాలలో అవాంతరాలు. పనులు పెండింగ్‌లో పడతాయి. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

తుల: ప్రముఖులతో పరిచయాలు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు పుంజుకుంటాయి.

వృశ్చికం: కుటుంబంలో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. స్వల్ప అనారోగ్యం. ప్రయాణాలలో ఆటంకాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

ధనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనాలు కొంటారు. విందువినోదాలు. యత్నకార్యసిద్ది. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

మకరం: కుటుంబంలో మరిన్ని సమస్యలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కుంభం: ఉద్యోగయత్నాలు సానుకూలం. తీర్థయాత్రలు చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించినరీతిలో ఉంటాయి.

మీనం: మీ ఖ్యాతి పెరుగుతుంది. అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top