Today Horoscope In Telugu: Rasi Phalalu 23-04-2022 - Sakshi
Sakshi News home page

Today Horoscope: ఈ రాశివారికి అరోగ్యసమస్యలు.. ధనవ్యయం

Apr 23 2022 6:17 AM | Updated on Apr 23 2022 9:09 AM

Today Horoscope In Telugu 23-04-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి బ.సప్తమి ఉ.9.56 వరకు, తదుపరి అష్టమి నక్షత్రం ఉత్తరాషాఢ రా.10.10 వరకు, తదుపరి శ్రవణం వర్జ్యం ఉ.7.10 నుండి 8.42 వరకు, తిరిగి రా.1.54 నుండి 3.25 వరకు, దుర్ముహూర్తం ఉ.5.44 నుండి 7.24 వరకు అమృతఘడియలు... ఉ.9.40 నుండి 11.13 వరకు.

సూర్యోదయం :    5.32
సూర్యాస్తమయం    :  6.19
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు
 

మేషం: వ్యవహారాలలో పురోగతి. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

వృషభం: సన్నిహితులతో వైరం. దూర ప్రయాణాలు. స్నేహితుల నుంచి సమస్యలు. అనారోగ్యం. ఉద్యోగయత్నాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారతాయి.

మిథునం: మిత్రులు, బంధువులతో తగాదాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. 

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం: సన్నిహితుల నుంచి మాటసాయం. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.

కన్య: శ్రమ ఫలించక నిరాశ చెందుతారు. వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణాలు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

తుల: వ్యవహారాలలో ఆటంకాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. అరోగ్యసమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందిపరుస్తాయి.

వృశ్చికం: సన్నిహితులతో సఖ్యత. ఆప్తుల  నుంచి ధనలాభం. నిర్ణయాలు సకాలంలో తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి. 

ధనుస్సు: కుటుంబంలో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

మకరం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తు, వస్త్రలాభాలు. పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

కుంభం: సన్నిహితులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో అవాంతరాలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మీనం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement