
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: శు.చతుర్దశి రా.1.11 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం: మూల తె.5.21 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: ప.12.06 నుండి 1.50 వరకు, తదుపరి రా.3.37 నుండి 5.21 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.39 నుండి 12.31 వరకు, అమృతఘడియలు: రా.10.15 నుండి 11.53 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.35, సూర్యాస్తమయం: 6.35.
మేషం.... పనుల్లో తొందరపాటు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.
వృషభం... సన్నిహితులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. విద్యార్థులకు నిరాశ. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
మిథునం... ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
కర్కాటకం... ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. సంఘంలో గౌరవం. భూవివాదాలు పరిష్కారం. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
సింహం... ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. స్థిరాస్తి వివాదాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.
కన్య.... రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కనిపిస్తుంది.
తుల... నూతన ఉద్యోగప్రాప్తి. సమాజంలో ప్రత్యేక గౌరవం. భూలాభాలు పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
వృశ్చికం... దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.
ధనుస్సు... వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆశ్చర్యకర సంఘటనలు. ఒప్పందాలు కుదురుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
మకరం.... పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కుంభం... పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి.
మీనం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా కొనసాగుతాయి.