
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి శు.పంచమి సా.4.20 వరకు, తదుపరి షష్ఠి నక్షత్రం రోహిణి సా.6.15 వరకు, తదుపరి మృగశిర వర్జ్యం... ఉ.9.29 నుండి 11.15 వరకు, తిరిగి రా.12.26 నుండి 2.15 వరకు, దుర్ముహూర్తం ప.11.36 నుండి 12.25 వరకు అమృతఘడియలు... ప.2.44 నుండి 4.23 వరకు.
సూర్యోదయం : 5.55
సూర్యాస్తమయం : 6.10
రాహుకాలం : ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుంచి 9.00 వరకు
రాశిఫలాలు:
మేషం: ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. బంధువర్గంతో విరోధాలు. కొన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తారు. వ్యాపారులకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులకు ఊహించని బదిలీలు ఉండవచ్చు.
వృషభం: ప్రముఖుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు సేకరిస్తారు. భూవివాదాల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగాల్లో సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
మిథునం: ఆదాయం అంతగా కనిపించదు. శ్రమానంతరం కార్యక్రమాలు పూర్తి. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. సన్నిహితులతో అకారణంగా విభేదాలు. వ్యాపారులకు నిరాశే మిగులుతుంది. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది.
కర్కాటకం: ఉద్యోగయత్నాలు సానుకూలం. సన్నిహితుల నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు. వాహనసౌఖ్యం. వ్యాపారులకు అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉన్నత స్థితి.
సింహం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. శ్రేయోభిలాషులు చేయూతనందిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఊహించిన లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు.
కన్య: దూరప్రయాణాలు సంభవం. ఉద్యోగ, వివాహయత్నాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. రాబడి తగ్గి రుణాలు చేస్తారు. వ్యాపారులకు కొంత గందరగోళం. ఉద్యోగులకు పనిభారం.
తుల: కుటుంబసమస్యలు వేధిస్తాయి. ఆదాయం అంతగా కనిపించదు. బంధుగణంతో అకారణ వైరం. వాహనాలు, ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు. వ్యాపారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.
వృశ్చికం: బంధువుల నుంచి సహాయం అందుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారవృద్ధి. ఉద్యోగాల్లో సంతోషకరమైన వార్తలు.
ధనుస్సు: చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. కొత్త పరిచయాలు. వివాదాల నుంచి బయటపడతారు. ఉద్యోగావకాశాలు. వ్యాపారులు
ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు.
మకరం: అనుకోని ఖర్చులతో అప్పులు చేస్తారు. బంధుగణంతో వివాదాలు. ఆలోచనలు కలిసిరావు. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. భాగస్వామ్య వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.
కుంభం: కార్యక్రమాలలో అవాంతరాలు. శారీరక రుగ్మతలు. బంధువర్గంతో ముఖ్యవిషయాలపై చర్చిస్తారు.ఆదాయం అంతంత మాత్రం. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు చికాకులు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. .
మీనం: చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. శుభవర్తమానాలు. వాహన, గృహయోగాలు. అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపారుల లక్షా్యలు సాధిస్తారు. ఉద్యోగులకు వివాదాలు తీరతాయి.