ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. దూరపు బంధువుల కలయిక

Today Horoscope 31-12-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి: శు.నవమి రా.11.02 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: రేవతి సా.4.40 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.6.33 నుండి 8.02 వరకు, అమృతఘడియలు: ప.2.17 నుండి 3.51 వరకు;

రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు,
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు;
సూర్యోదయం 6.34;
సూర్యాస్తమయం 5.32.
 

మేషం: పనుల్లో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.

వృషభం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యసిద్ధి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.

మిథునం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. భూలాభాలు. వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహం.

కర్కాటకం: మిత్రులతో అకారణ వైరం. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

సింహం: కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.

కన్య: ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

తుల: శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో ఆదరణ. నూతన పరిచయాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.

వృశ్చికం: పనుల్లో ఆటంకాలు. ఆదాయానికి మించిన ఖర్చులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.

ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. పనులు ముందుకు సాగవు. వృత్తి, వ్యాపారాలలో ఆటుపోట్లు.

మకరం: కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. మిత్రుల కలయిక. వృత్తి,వ్యాపారాలలో పైచేయి సాధిస్తారు.

కుంభం: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగమార్పులు.

మీనం: రుణాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top