
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి శు.తదియ ఉ.10.20 వరకు, తదుపరి చవితి నక్షత్రం ఉత్తరాషాఢ ప.2.47 వరకు, తదుపరి శ్రవణం వర్జ్యం రా.6.14 నుండి 7.44 వరకు, దుర్ముహూర్తం ఉ.8.36 నుండి 10.06 వరకు, తదుపరి ప.12.25 నుండి 1.17 వరకు అమృతఘడియలు... ఉ.8.36 నుండి 9.45 వరకు.
సూర్యోదయం : 5.29
సూర్యాస్తమయం : 6.32
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు
మేషం...కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో పురోగతి.
వృషభం...ఆర్థిక పరిస్థితి నిరుత్సుహపరుస్తుంది. దూరప్రయాణాలు. బంధువిరోధాలు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. దైవదర్శనాలు.
మిథునం...సన్నిహితులతో విభేదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వాహనాలు జాగ్రత్త. వ్యాపారాలలో కొన్ని చికాకులు. ఉద్యోగాలలో ఆటుపోట్లు. దైవచింతన.
కర్కాటకం....పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. కీలక నిర్ణయాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి.
సింహం...కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. అందరిలోనూ గౌరవం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.
కన్య...ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం.
తుల....ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువులతో తగాదాలు.ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో ఒత్తిడులు. విద్యార్థులకు శ్రమాధిక్యం.
వృశ్చికం..బంధువుల కలయిక. విందువినోదాలు. కాంట్రాక్టర్లకు అనుకూలం. పనులు చకచకా సాగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
ధనుస్సు...వ్యవహారాలు నిరాశ కలిగిస్తుంది. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు.
మకరం..పరపతి పెరుగుతుంది. మిత్రుల నుంచి కీలక సమాచారం. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
కుంభం....కుటుంబసభ్యులతో వివాదాలు. శ్రమ తప్పదు. ధననష్టం. ఆరోగ్యసమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో మార్పులు. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. పనులలో ఆటంకాలు.
మీనం..ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. ధనలాభం. కొత్త్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పైచేయిగా ఉంటుంది. వస్తులాభాలు.