
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: బ.అష్టమి రా.10.11 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: ఉత్తర తె.5.27 వరకు (తెల్లవారితే శనివారం) తదుపరి హస్త, వర్జ్యం: ప.11.37 నుండి 1.20 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.37 నుండి 9.20 వరకు, తదుపరి ప.12.15 నుండి 1.01 వరకు, అమృతఘడియలు: రా.9.46 నుండి 11.28 వరకు; రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు; సూర్యోదయం 6.26; సూర్యాస్తమయం 5.27.
మేషం : మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం.
వృషభం: శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు
.
మిథునం: కొత్త పరిచయాలు. సంఘంలోగౌరవం పెరుగుతుంది. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. పనులు చకచకా సాగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.
కర్కాటకం: మిత్రుల నుంచి ఒత్తిడులు. అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. నిర్ణయాలు మార్చుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో కొంత నిరాశ. ఉద్యోగాలలో చికాకులు.
సింహం: చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
కన్య: రుణభారాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో కొంత గందరగోళం.
తుల: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో విశేష గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
వృశ్చికం: దూరపు బంధువులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దైవచింతన. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
ధనుస్సు: సన్నిహితులు, మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. అనారోగ్యం. శ్రమానంతరం పనులు పూర్తి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో సామాన్యలాభాలు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.
మకరం: వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్య సూచనలు. దైవచింతన. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.
కుంభం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.
మీనం: శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ధనలబ్ధి. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.