ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

Today Horoscope 14 12 2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: బ.షష్ఠి రా.7.36 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: మఖ రా.2.07 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం:  ప.12.57 నుండి 2.43 వరకు,  దుర్ముహూర్తం: ప.11.31 నుండి 12.15 వరకు, అమృత ఘడియలు: రా.11.28 నుండి 1.13 వరకు

సూర్యోదయం :    6.25
సూర్యాస్తమయం    :  5.24
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితి. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. బం«ధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వ్యాపారాలలో తొందరవద్దు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

వృషభం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబపరంగా కొంత చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. అనారోగ్యం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

మిథునం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.

కర్కాటకం: మిత్రులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణయత్నాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

సింహం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం. భూవివాదాల పరిష్కారం. పనులు సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో హోదాలు.

కన్య: శ్రమ తప్పకపోవచ్చు. పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. అనారోగ్య సూచనలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో కొన్ని సమస్యలు. ఉద్యోగాలలో నిరుత్సాహం.

తుల: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. భూ, వాహనయోగాలు. సోదరుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

వృశ్చికం: కొన్ని బాకీలు వసూలవుతాయి. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలత.

ధనుస్సు: పరిస్థితులు అనుకూలించవు. పనుల్లో ప్రతిష్ఠంభన. దూరప్రయాణాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు సామాన్యమే. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మకరం: సన్నిహితులు, మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. దైవదర్శనాలు. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలలో సామాన్యలాభాలు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

కుంభం: మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు అనుకోని అవకాశాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత సానుకూలం.

మీనం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయ దర్శనాలు. కుటుంబసమస్యలు తీరతాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top