ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. వస్తులాభాలు | Rasi Phalalu: Daily Horoscope On 20-09-2025 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. వస్తులాభాలు

Sep 20 2025 1:52 AM | Updated on Sep 20 2025 1:52 AM

Rasi Phalalu: Daily Horoscope On 20-09-2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: బ.చతుర్దశి రా.12.09 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: మఖ ఉ.9.10 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: సా.5.26 నుండి 7.05 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.48 నుండి 7.29 వరకు, అమృత ఘడియలు: ఉ.6.40 నుండి 8.18 వరకు, తదుపరి రా.3.19 నుండి 4.57 వరకు, మాస శివరాత్రి.

సూర్యోదయం : 5.52
సూర్యాస్తమయం : 5.57
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు

మేషం: ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

వృషభం: ఆర్థిక ఇబ్బందులు. కొత్తగా రుణాలు చేస్తారు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆస్తి వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు. ఉద్యోగాలలో నిరాశ.

మిథునం: వ్యవహారాలలో విజయం. ఆప్తులతో వివాదాలు తీరతాయి. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ ధ్యేయాలు నెరవేరతాయి.

కర్కాటకం: వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు తప్పుతాయి.

సింహం: వ్యవహారాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు దక్కుతాయి. ధన, వస్తులాభాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ముందంజ.

కన్య: రుణబాధలు తప్పవు. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాల సందర్శనం. పనులలో జాప్యం. బంధువర్గం నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తప్పవు.

తుల: బంధువులతో సఖ్యత. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. భూలాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వృశ్చికం: కొన్ని బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

ధనుస్సు: మిత్రులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యయప్రయాసలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

మకరం: ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో అవాంతరాలు.బాధ్యతలు మరింత పెరుగుతాయి. అనారోగ్యం. దూరప్రయాణాలు. వృత్తులు, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

కుంభం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కుటుంబంలో ఆనందదాయకంగా ఉంటుంది. దైవచింతన. వృత్తులు, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు.

మీనం: అనుకున్న కార్యక్రమాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూలత. స్థిరాస్తి లాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement