
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: బ.ద్వాదశి రా.12.18 వరకు, తదుపరి త్రయోదశి,నక్షత్రం: పుష్యమి ఉ.9.02 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: రా.9.45 నుండి 11.20 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.54 నుండి 10.42 వరకు తదుపరి ప.2.45 నుండి 3.33 వరకు, అమృత ఘడియలు: ఉ.9.54 నుండి 10.41 వరకు.
సూర్యోదయం : 5.52
సూర్యాస్తమయం : 5.59
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
మేషం.... కొన్ని పనులు మధ్యలో వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో నిరుత్సాహం.
వృషభం.. యత్నకార్యసిద్ధి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థికాభివృద్ధి. ఆస్తిలాభం. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మిథునం... వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
కర్కాటకం... కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వస్తులాభాలు. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.
సింహం.... సన్నిహితులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనుల్లో జాప్యం. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.
కన్య... ప్రముఖులతో పరిచయాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కీలక సందేశం. విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది.
తుల.... ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలో అవాంతరాలు తొలగుతాయి. వస్తులాభాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు.
వృశ్చికం... బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
ధనుస్సు.... పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. విలువైన పత్రాలు జాగ్రత్త. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం.
మకరం... కొత్త్త పనులు ప్రారంభిస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.
కుంభం.. పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజసేవలో పాల్గొంటారు. కొన్ని బాకీలు సైతం అందుతాయి. వివాదాలు పరిష్కారం. దైవదర్శనాలు. కార్యసిద్ధి. వృత్తులు, వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి.
మీనం...మిత్రులతో వివాదాలు. అనుకున్న ఉద్యోగావకాశాలు చేజారవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిళ్లు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.