ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి | Today Telugu Horoscope On June 9th, 2025: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి

Jun 9 2025 5:39 AM | Updated on Jun 9 2025 9:14 AM

Rasi Phalalu: Daily Horoscope On 09-06-2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.త్రయోదశి ఉ.8.54 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: విశాఖ ప.3.21 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: రా.7.45 నుండి 9.31 వరకు, దుర్ముహూర్తం: ప.12.26 నుండి 1.18 వరకు, తదుపరి ప.3.03 నుండి 3.55 వరకు, అమృతఘడియలు: ఉ.5.34 నుండి 7.21 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.29. 

మేషం...... ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. 

వృషభం... కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలకు అనుకూలం. విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. 

మిథునం... శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. ప్రముఖులతో పరిచయాలు. ఆసక్తికరమైన సమాచారం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

కర్కాటకం... వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆలోచనలు కలసిరావు. 

సింహం.... ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపూరితంగా ఉంటాయి. బంధువులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. విద్యార్థులకు ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. 

కన్య.... ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

తుల...... వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బాధ్యతలు అధికం. 

వృశ్చికం... ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. అతిథుల ద్వారా కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం. 

ధనుస్సు.... రుణాలు చేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. పనులలో జాప్యం. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగాసాగుతాయి. 

మకరం... కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. 

కుంభం... ప్రయత్నాలు సఫలం. శుభకార్యాలరీత్యా ధనవ్యయం. ఆసక్తికరమైన సమాచారం. కొన్ని వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. 

మీనం.... పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదిస్తారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. దైవచింతన.  

Advertisement
 
Advertisement
Advertisement