
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: శు.నవమి ఉ.7.54 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: విశాఖ ఉ.6.04 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: ఉ.10.25 నుండి 12.11 వరకు, దుర్ముహూర్తం: సా.4.44 నుండి 5.36 వరకు, అమృత ఘడియలు: రా.9.01 నుండి 10.47 వరకు.
సూర్యోదయం : 5.42
సూర్యాస్తమయం : 6.29
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం.... ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు. బంధువర్గంతో విభేదాలు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో గందరగోళం నెలకొంటుంది.
వృషభం... సన్నిహితులు,మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. గృహయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు.
మిథునం... పలుకుబడి పెంచుకుంటారు. యత్నకార్యసిద్ధి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులు దగ్గరవుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
కర్కాటకం... ప్రయాణాలు వాయిదా. మిత్రులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు.
సింహం.... ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు సంభవం.
కన్య..... ఇంటిలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. మిత్రులతో మంచీచెడ్డా విచారిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
తుల....కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. వివాదాలకు దూరంగా ఉండండి. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
వృశ్చికం....ఉద్యోగ, విద్యాయత్నాలు అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖ వ్యక్తుల పరిచయాలు. ధనలాభం. ఆహ్వానాలు అందుతాయి.. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలు ఆశించిన విధంగా ఉంటాయి.
ధనుస్సు......కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనుకోని ప్రయాణాలు.కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ తప్పదు.
మకరం.... చేపట్టిన పనులు సకాలంలో పూర్తి. ఆకస్మిక ధనలబ్ధి. నూతన పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు.
కుంభం... వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులు లక్షా్యలు సాధిస్తారు. పనులు సక్రమంగా సాగుతాయి. బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. దూరప్రయాణాలు. కొత్త ఉద్యోగాలు దక్కుతాయి.
మీనం... వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు.
వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.