ఈ రాశివారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు..

Horoscope Today 24-03-2023 - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.తదియ రా.7.34 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: అశ్వని ప.3.51 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: ఉ.11.55 నుండి 1.29 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.30 నుండి 9.16 వరకు తదుపరి ప.12.29 నుండి 1.19 వరకు, అమృత ఘడియలు: ఉ.8.43 నుండి 10.19 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 6.05, సూర్యాస్తమయం: 6.07. 

మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వృషభం: పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మిథునం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.

కర్కాటకం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ధన, వస్తులాభాలు. పరపతి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహం: మిత్రుల నుంచి వ్యవహారాలలో ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కాస్త నిరాశ.

కన్య: పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

తుల: బంధువుల కలయిక. ధనలబ్ధి. నూతన ఉద్యోగావకాశాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

వృశ్చికం: నూతన ఉద్యోగాలు దక్కవచ్చు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న అభివృద్ధి కనిపిస్తుంది.

ధనుస్సు: మిత్రులు ఒత్తిడులు పెంచుతారు. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు. శ్రమాధిక్యం. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత అనుకూలిస్తాయి.

మకరం: శ్రమాధిక్యంతో పనులు పూర్తి. ప్రయాణాలు వాయిదా. బంధుమిత్రులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

కుంభం: ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు. ఆర్థిక ప్రగతి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు.

 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top