నేటి దినఫలం: ఈ రాశివారికి ఆస్తిలాభం.. మిగతా 11 రాశుల ఫలితాలు ఇలా..

Horoscope Today 22 05 2023 - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం,
సూర్యోదయం: 5.30, సూర్యాస్తమయం: 6.22. 

తిథి: శు.తదియ రా.10.06 వరకు, తదుపరి చవితి,
నక్షత్రం: మృగశిర ఉ.9.53 వరకు, తదుపరి ఆరుద్ర,

వర్జ్యం: సా.6.54 నుండి 8.37 వరకు,
దుర్ముహూర్తం: ప.12.20, నుండి 1.14 వరకు, తదుపరి ప.2.55 నుండి 3.46 వరకు,
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు,
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు,

అమృతఘడియలు: రా.12.54 నుండి 2.35 వరకు.;

మేషం: కొత్త ఉద్యోగాలలో ప్రవేశం. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. వస్తు లాభాలు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. 

వృషభం: మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. దూరపు బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. 

మిథునం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. 

కర్కాటకం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు సంభవం. 

సింహం: పనులు సాఫీగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అభివృద్ధి.

కన్య: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. వాహన, గృహయోగాలు. ఆస్తిలాభం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. 

తుల: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ధనవ్యయం.  కుటుంబ సభ్యులతో  స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి,వ్యాపారాలలో ఒత్తిడులు. 

వృశ్చికం: బంధువర్గం నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. 

ధనుస్సు: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి. 

మకరం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. ఆస్తిలాభం. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. 

కుంభం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు కలిసిరావు. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. 

మీనం: రుణాలు చేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పదు. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top