Horoscope Today: February 16, 2023 In Telugu - Sakshi
Sakshi News home page

ఈ రాశివారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు..

Feb 16 2023 6:42 AM | Updated on Feb 16 2023 9:53 AM

Horoscope Today 16 02 2023 - Sakshi

పనులు సజావుగా సాగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. సన్మానయోగం. దైవచింతన. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.ఏకాదశి రా.10.55 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: మూల రా.7.19 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: సా.5.46 నుండి 7.18 వరకు, తిరిగి తె.4.20 నుండి 5.50 వరకు (తెల్లవారితే శుక్రవారం), దుర్ముహూర్తం: ఉ.10.20 నుండి 11.04 వరకు, తదుపరి ప.2.55 నుండి 3.40 వరకు, అమృతఘడియలు: ప.1.33 నుండి 2.44 వరకు, రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం : ఉ. 6.00 నుండి 7.30 వరకు,  సూర్యోదయం : 6.31, సూర్యాస్తమయం : 5.57

మేషం: అనుకున్న పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. మిత్రులతో కలహాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం: మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు ఒత్తిడులు.

మిథునం: పనులు సజావుగా సాగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. సన్మానయోగం. దైవచింతన. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.

కర్కాటకం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

సింహం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దూర ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కన్య: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు.

తుల: సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృశ్చికం: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ఖర్చులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు మార్పులు.

ధనుస్సు: వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. విందువినోదాలు. పరిచయాలు పెరుగుతాయి. బంధువుల కలయిక. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

మకరం: బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

కుంభం: ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ. ఉద్యోగులకు హోదాలు.

మీనం: పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement