
నూతనోత్సాహంతో పనులు పూర్తి. సంఘంలో గౌరవం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. విద్యావకాశాలు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.నవమి రా.2.43 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: అనూరాధ రా.9.36 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: రా.2.58 నుండి 4.32 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.47 నుండి 9.33 వరకు, అమృతఘడియలు: ప.11.29 నుండి 1.02వరకు.
సూర్యోదయం : 6.32
సూర్యాస్తమయం: 5.57
రాహుకాలం : ప.3.00
నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. పనుల్లో జాప్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రులతో వివాదాలు. దూరయ్రాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో గందరగోళం.
వృషభం: సన్నిహితుల నుంచి ధనలబ్ధి. నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. అరుదైన సన్మానాలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో మరింత అభివృద్ధి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
మిథునం: నూతనోత్సాహంతో పనులు పూర్తి. సంఘంలో గౌరవం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. విద్యావకాశాలు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.
కర్కాటకం: మిత్రుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా నిరుత్సాహం. చేపట్టిన పనుల్లో అవాంతరాలు. విద్యార్థులకు నిరాశ. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో పనిభారం తప్పదు.
సింహం: ముఖ్య వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో పెట్టుబడులు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.
కన్య: పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
తుల: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో శ్రమాధిక్యం. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో విరోధాలు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో చికాకులు.
వృశ్చికం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు తప్పవు.
ధనుస్సు: పరిస్థితులు అనుకూలించవు. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. నిరుద్యోగుల యత్నాలలో అవాంతరాలు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.
మకరం: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలకు హాజరవుతారు. సోదరులు, సోదరీలతో సఖ్యత. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. కొన్ని వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభాల వైపు సాగుతాయి. ఉద్యోగాలలో ఎదురుండదు.
కుంభం: రుణాలు తీరతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. కొన్ని వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.
మీనం మిత్రులతో కలహాలు. ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల కలయిక. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు. ఉద్యోగాలలో చిక్కులు.