దినఫలం: ఈ రాశివారికి పనుల్లో తొందరపాటు పనికిరాదు.. మిగతా రాశులవారికి ఎలాగ ఉందంటే..

Horoscope today 07 03 2023 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం,
సూర్యోదయం: 6.19, సూర్యాస్తమయం: 6.03. 

తిథి: పౌర్ణమి సా.5.51 వరకు, తదుపరి బ.పాడ్యమి,
నక్షత్రం: పుబ్బ రా.2.12 వరకు, తదుపరి ఉత్తర,

వర్జ్యం: ఉ.8.45 నుండి 10.28 వరకు,
దుర్ముహూర్తం: ఉ.8.38 నుండి 9.25 వరకు, తదుపరి రా.10.56 నుండి 11.45 వరకు,

అమృతఘడియలు: రా.7.11 నుండి 8.55 వరకు, హోళీ పౌర్ణమి;

రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు,
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు,

మేషం: ప్రయాణాలలో ఆటంకాలు. పనులు ముందుకు సాగవు. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్య సూచనలు. శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

వృషభం: ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాల సందర్శనం. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

మిథునం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మంచి గుర్తింపు రాగలదు.

కర్కాటకం: పనులలో జాప్యం. ఆర్థిక విషయాలు మందకొడిగా ఉంటాయి. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. మిత్రుల నుంచి సమస్యలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. బంధువులతో సఖ్యత. విలాసవంతంగా గడుపుతారు. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు.

కన్య: ముఖ్యమైన పనుల్లో తొందరపాటు ప్రదర్శిస్తారు. అది మంచిది కాదు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు తప్పవు. బంధువులు, మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత వరకు లాభిస్తాయి. ఉద్యోగాలలో  పనిభారం.

తుల: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనూహ్య మార్పులు.

వృశ్చికం: నూతన ఉద్యోగాలు పొందుతారు. సోదరులు,సోదరీలతో సఖ్యత. విందువినోదాలు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనయోగం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

ధనుస్సు: రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

మకరం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

కుంభం: మిత్రుల నుంచి ముఖ్య సమాచారం. ఆస్తిలాభ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు. నూతన ఒప్పందాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

మీనం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top