ఈ రాశివారికి ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది

Daily Horoscope In Telugu 7th June 2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి బ.ద్వాదశి ఉ.9.16 వరకు,తదుపరి త్రయోదశి, నక్షత్రం భరణి పూర్తి (24గంటలు), వర్జ్యం ప.2.04 నుండి 3.51 వరకు, దుర్ముహూర్తం ప.12.23 నుండి 1.17 వరకు,  తదుపరి ప.3.01 నుండి 3.52 వరకు,  అమృత ఘడియలు రా.12.40 నుంచి 2.22 వరకు

సూర్యోదయం :    5.28
సూర్యాస్తమయం    :  6.28
రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుంచి 12.00 వరకు 

రాశి ఫలాలు: 
మేషం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. సన్నిహితుల నుంచి సహాయం. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృషభం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆరోగ్యభంగం.

మిథునం: ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. ఆకస్మిక ధన,వస్తులాభాలు.

కర్కాటకం: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆర్థిక ప్రగతి. చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా పూర్తి. ఉద్యోగులకు పదోన్నతులు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు.

సింహం: దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. పాతమిత్రులను కలుసుకుంటారు. ధనవ్యయం.

కన్య: ప్రయాణాలు. రుణయత్నాలు. పనులలోజాప్యం. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. దైవచింతన.

తుల: పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు.

వృశ్చికం: పాతమిత్రుల కలయిక. ఇంటర్వ్యూలు అందుతాయి. ఆసక్తికరమైన సమాచారం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు: ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనులు మందగిస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. వ్యాపారాలు మందగిస్తాయి.

మకరం: కుటుంబంలో చికాకులు. బంధువుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఉద్యోగాలు, వ్యాపారాలలో మార్పులు ఉండవచ్చు.

కుంభం: పనులలో విజయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. దైవదర్శనాలు.

మీనం: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. ఉద్యోగులకు అదనపు పనిభారం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. సోదరుల కలయిక.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top