ఈ రాశివారికి మానసిక అశాంతి

Daily Horoscope In Telugu 17th June 2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి శు.సప్తమి సా.5.48 వరకు, తదుపరి అష్టమి నక్షత్రం పుబ్బ రా.6.51 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం రా.1.47 నుండి 3.22 వరకు, దుర్ముహూర్తం ఉ.9.51 నుండి 10.43 వరకు, తదుపరి ప.3.02 నుండి 3.54 వరకు అమృతఘడియలు... ప.12.29 నుంచి 2.03 వరకు.

సూర్యోదయం :  5.29
సూర్యాస్తమయం :  6.32
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు
 

దినఫలాలు
మేషం.. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు.  వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యసమస్యలు. 

వృషభం.. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. అనారోగ్యం. చర్చలలో ప్రతిష్ఠంభన. 

మిథునం.. శుభవార్తా శ్రవణం. కొత్త కార్యక్రమాలు చేపడతారు. సోదరులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. ధనలబ్ధి.

కర్కాటకం... ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. అనుకోని ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. 

సింహం.. విద్యార్థులు ప్రతిభ నిరూపించుకుంటారు. యత్నకార్యసిద్ధి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది. వాహనయోగం. 

కన్య.. సోదరులతో విభేదాలు .అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. మానసిక అశాంతి. పనులు వాయిదా వేస్తారు. నిరుద్యోగులకు నిరాశ. 

తుల.. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. 

వృశ్చికం.. ఆకస్మిక ధనలబ్ధి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆలోచనలు కలసివస్తాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. 

ధనుస్సు.. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. పనుల్లో అవరోధాలు. అనుకోని ఖర్చులు. కష్టపడ్డా ఫలితం కనిపించదు.  వ్యాపారాలు అంతగా కలసిరావు. ఉద్యోగ మార్పులు. 

మకరం.. వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. నిర్ణయాలు వాయిదా. 

కుంభం.. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో చర్చలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. వస్తులాభాలు. 

మీనం.. కొత్త పనులు చేపడతారు. దైవదర్శనాలు. బంంధువుల నుంచి ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.   

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top