ఈ రాశి వారి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన.. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. | Daily Horoscope On 20 January 2025 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన.. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది.

Jan 20 2025 5:27 AM | Updated on Jan 20 2025 8:32 AM

Daily Horoscope On 20 January 2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి: బ.షష్ఠి ఉ.9.05 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: హస్త రా.7.54 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం: తె.4.48 నుండి 6.32 వరకు (తెల్లవారితే మంగళవారం),దుర్ముహూర్తం: ప.12.37 నుండి 1.25 వరకు, తదుపరి ప.2.51 నుండి 3.39 వరకు, అమృతఘడియలు: ప.1.11 నుండి 2.58 వరకు.

సూర్యోదయం :    6.39
సూర్యాస్తమయం    :  5.45
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం....రుణాలు తీరుస్తారు. వ్యవహారాలలో మరింత పురోగతి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో అంచనాలు నిజమవుతాయి. వాహనాలు, భూములు కొంటారు..

వృషభం...కుటుంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. విచిత్రమైన సంఘటనలు. బంధువులను కలుసుకుంటారు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు.

మిథునం....ముఖ్య నిర్ణయాలు వాయిదా. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. కళాకారుల యత్నాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన.

కర్కాటకం...మిత్రులతో వివాదాలు కొంత తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి వివాదాలు కొంత పరిష్కారం. శుభవార్తలు వింటారు.

సింహం....పనుల్లో ప్రతిష్ఠంభన. కొత్తగా రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. కళాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా.

కన్య.....కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. బంధువుల నుంచి కీలక సమాచారం. ఆస్తిలాభం. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక.

తుల....పనులు కొన్ని హఠాత్తుగా నిలిపివేస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. వ్యాపార, ఉద్యోగాలు ∙నిరాశ కలిగిస్తాయి.

వృశ్చికం..దూరపు బంధువులను కలుస్తారు. ఇంటాబయటా  అనుకూలం. ఉపయుక్త సమాచారం అందుతుంది. పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో మరింత సానుకూలత. విందువినోదాలు..

ధనుస్సు...చిన్ననాటి మిత్రుల కలయిక. పలుకుబడి పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నూతన ఉద్యోగాలు పొందుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు.

మకరం...శ్రమించినా ఫలితం ఉండదు. కొన్ని పనుల్లో ఆటంకాలు. ఖర్చులు పెరిగి రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిళ్లు పెరుగుతాయి. బంధువర్గంతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం..

కుంభం...కుటుంబసభ్యులతో వివాదాలు. ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని చర్చలు మధ్యలో నిలిపివేస్తారు. వృత్తి,వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. అనారోగ్యం. పనులలో కొంత జాప్యం.

మీనం... యత్నకార్యసిద్ధి. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. శుభవార్తలు అందుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వృత్తి, వ్యాపారాలలో మరింత  ప్రోత్సాహం. చిన్ననాటి మిత్రుల నుంచి పిలుపు రావచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement