ఈ రాశివారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు | Daili Horoscope In Telugu 18th June 2021 | Sakshi
Sakshi News home page

ఈ రాశివారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు

Jun 18 2021 6:23 AM | Updated on Jun 18 2021 6:25 AM

Daili Horoscope In Telugu 18th June 2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి శు.అష్టమి సా.4.24 వరకు, తదుపరి నవమి నక్షత్రం ఉత్తర సా.6.09 వరకు, తదుపరి హస్త, వర్జ్యం రా.2.11 నుండి 3.43 వరకు, దుర్ముహూర్తం ఉ.8.07 నుండి 8.57 వరకు తదుపరి ప.12.26 నుండి 1.20 వరకు అమృతఘడియలు... ఉ.11.07 నుంచి 12.40 వరకు.
సూర్యోదయం :    5.30
సూర్యాస్తమయం    :  6.32
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

దినఫలాలు:
మేషం.. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. కాంట్రాక్టులు పొందుతారు. యత్నకార్యసిద్ధి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో పురోగతి.

వృషభం.. వ్యవహారాలలో ఆటంకాలు. దుబరా ఖర్చులు. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. మానసిక అశాంతి.  స్వల్ప అనారోగ్యం.

మిథునం.. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. అనుకోని ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. 

కర్కాటకం.. ప్రముఖులతో పరిచయాలు. కొత్త ఉద్యోగావకాశాలు. పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా ఉంటుంది. 

సింహం.. వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు.  కష్టపడ్డా ఫలితం కనిపించదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. 

కన్య.. పరిచయాలు పెరుగుతాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

తుల.. ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం కంటే ఖర్చులు అధికం. పనుల్లో ఆటంకాలు. సోదరులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

వృశ్చికం.. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 

ధనుస్సు.. పనులు విజయవంతంగా పూర్తి. సోదరుల నుంచి ఆస్తిలాభం. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం. 

మకరం.. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. మనశ్శాంతి లోపిస్తుంది. ఆరోగ్య సమస్యలు. ఆలయాలు దర్శిస్తారు. బంధువులతో తగాదాలు. 

కుంభం.. దూరప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం.. కొత్త విషయాలు తెలుసుకుంటారు. అనుకోని విధంగా ధనలాభం. ఆస్తి వివాదాల పరిష్కారం. స్థిరాస్తి వృద్ధి. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement