నాలుగేళ్ల తర్వాత తెలిసింది | - | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల తర్వాత తెలిసింది

May 4 2026 7:43 AM | Updated on May 4 2026 7:43 AM

నా పేరు గిరిధర్‌రావు. ప్రొద్దుటూరు గౌరవమ్మకట్ట వీధిలో నివాసం ఉంటున్నాను. బట్టలషాపులో గుమస్తాగా పని చేస్తాను. మా కుమారుడు శ్రీనివాసరావుకు ప్రస్తుతం 11 ఏళ్లు. బాబు పుట్టగానే రెండున్నరేళ్లకు నడిచాడు. 4 ఏళ్ల వయసులో స్కూల్‌కు పంపించాం. స్కూల్లో నడస్తూనే కింద పడిపోయాడు. మాకు అర్థం కాక స్థానికంగా ఉన్న హాస్పిటల్‌కు తీసుకెళ్తే డాక్టర్‌ జయచంద్రారెడ్డి గుర్తించి బాబుకు డీఎండీ (డుచ్చెన్‌ మస్క్యులర్‌ డిస్ట్రోఫీ) వ్యాధి అని చెప్పారు. తర్వాత బెంగళూరు, కేరళ ఆస్పత్రుల్లో చూపించినా నయం కాలేదు. ఇప్పటికీ రూ. 10 లక్షల వరకు ఖర్చు అయింది. ప్రస్తుతం బాబు నడవలేడు కూర్చోలేడు మంచానికే పరిమితమయ్యాడు. పిజియోథెరపి, మందులకు గాను నెలకు రూ. 40 వేల వరకు ఖర్చు అవుతోంది. రెండేళ్ల క్రితం పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే ఇంత వరకు మంజూరు కాలేదు. హాస్పిటల్‌కు, ఎక్కడికై నా బయటికి వెళ్లాల్సి వస్తే బాబును నా వీపున పెట్టుకొని మోసుకెళ్తాను. నేను, నా భార్య శిల్ప ఎక్కడికి వెళ్లకుండా బాబును చూసుకుంటున్నాం.

Advertisement
 
Advertisement
Advertisement