ఊరూరా.. మందుపాతరలు
కూటమిపాలన రాకతోనే.. గ్రామాలు, పల్లెలు, పట్టణాలన్న తేడా లేకుండా బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. వీధి వీధికి మద్యం విక్రయాలు విస్తరింపజేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. ఇంటి గడపల వద్దకే మద్యం తీసుకురావడం ద్వారా కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. ప్రభుత్వ మద్యం ఒకవైపు, నకిలీ మద్యం విక్రయాలు మరోవైపు మందుబాబుల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నాయి. జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులపై మద్యం దుకాణాల ఏర్పాటు నిబంధనల నుంచి.. బెల్ట్ షాపుల నిర్వహణ వరకు ప్రతిదీ ఉల్లంఘనే. పల్లెల్లో బెల్టు షాపుల నిర్వహణ కోసం ఘర్షణ పడిన సంఘటనలు కోకొల్లలు. బెల్ట్ షాపులు ఉండొద్దని పైకి ఆదేశాలిస్తున్న ఎకై ్సజ్ శాఖ మాత్రం ఒక్క బెల్టు తీయలేక చోద్యం చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో మద్యం ఇక్కడ అక్కడ అని కాదు అంతటా ప్రవహిస్తోంది. దీని ఫలితంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అమాయక ప్రజలు ప్రాణాలు తీస్తున్నాయి.
–సాక్షి నెట్‌వర్క్
ఊరూరా.. మందుపాతరలు
ఊరూరా.. మందుపాతరలు
ఊరూరా.. మందుపాతరలు
ఊరూరా.. మందుపాతరలు


