
● సంఖ్య పెరిగే ఛాన్స్
నకిలీమద్యం తయారీ కేసులో నిందితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈనెల మూడున 12 మందిపై నమోదుచేయగా విచారణలో మరో ఇద్దరిని నిందితులు చేశారు. వీరికి తోడు మరో ఏడుగురిని చేర్చగా మళ్లీ మరో ఇద్దరిని చేర్చడంతో ఇప్పటికి ఈ కేసులో నిందితుల సంఖ్య 23కు చేరింది. కేసు దర్యాప్తు ముగింపు కు వచ్చేలోగా నిందితుల సంఖ్య పెరగొచ్చని భావిస్తున్నారు. కాగా అరెస్ట్ చేయాల్సిన నిందితుల కోసం ఎకై ్సజ్ పోలీసు బృందాలు ఆంధ్రా–కర్ణాటకల్లోని వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.