పెళ్లి చేయలేదని యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page
breaking news

పెళ్లి చేయలేదని యువకుడి ఆత్మహత్య

Jun 8 2025 12:56 AM | Updated on Jun 8 2025 12:56 AM

పెళ్లి చేయలేదని యువకుడి ఆత్మహత్య

పెళ్లి చేయలేదని యువకుడి ఆత్మహత్య

కురబలకోట : తల్లిదండ్రులు పెళ్లి చేయలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన కురబలకోట మండలంలో జరిగింది. ముదివేడు ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ కథనం మేరకు..పెద్దమండ్యంకు చెందిన గంగాధర్‌ (24) మండలంలోని అమ్మచెరువు మిట్ట వద్ద ఉన్న బండమీదకాలనీలో ఉన్నాడు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవాడు. పెళ్లి చేయాలని తల్లిదండ్రులను కోరాడు. ఇతనికి మూర్చ (ఫిట్స్‌) ఉంది. ఈ కారణంతో ఇప్పుడు పరిస్థితి బాగోలేదని మూర్ఛ నయం అయ్యాక చేస్తామని అంత వరకు ఓపిక పట్టాలని తల్లిదండ్రులు సర్దిచెప్పారు. దీంతో మనస్తాపం చెందిన ఇతను శుక్రవారం రాత్రి ఇంటిలో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు శనివారం పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement