
తత్కాల్ ఫార్మ్స్‌పై నంబర్లు వేసి ఇవ్వాలి
కమలాపురం : రైల్వేలో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ముందుగా దరఖాస్తు చేసుకునే తత్కాల్ ఫార్మ్స్‌పై నంబర్లు వేసి ఇన్షియల్ వేసి ఇవ్వాలని అభి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ ఎన్. విజయ్ బాబు తెలిపారు. మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్‌లో విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్‌కు ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైళ్లలో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వే శాఖ ఒక రోజు ముందుగా తత్కాల్ ద్వారా దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించిందన్నారు. అయితే దరఖాస్తులు ఎక్కువ ఉంటే తమకు సీట్లు కన్ఫార్మ్ అవుతాయో? లేదో? అనే ఆందోళనతో ముందుగా దరఖాస్తు చేసి కౌంటర్‌లో ఉంచిన ఫామ్స్‌ను తర్వాత వచ్చే ప్రయాణికులు నంబర్లు మార్చడం గాని, చించి వేయడం గాని జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కౌంటర్ వద్ద ఘర్షణలు జరిగే అవకాశం ఉందన్నారు. రైల్వే అధికారులు స్పందించి తత్కాల్ ఫామ్స్ ఇచ్చే సమయంలోనే స్పెషల్ ఇంక్‌తో నంబర్‌తో పాటు ఇన్షియల్ వేసి ఇస్తే ఇలాంటి సమస్యలు ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో ప్రయాణికులు పాల్గొన్నారు.