
గంజి పంపిణీ చేస్తున్న నిర్వాహకులు
పుణ్యకార్యం
ఉపవాసదీక్ష పరుల కోసం గంజి ఉచితంగా అందించడం పుణ్యకార్యం. దాదాపు 26 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాతల సహకారంలో నిర్వహిస్తున్నాం. రంజాన్ నెల ప్రారంభం నుంచి పండుగ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.
– రఫీక్‌బేగ్, మతపెద్ద, మదనపల్లె
మదనపల్లె సిటీ : రంజాన్ మాసంలో కఠిన ఉపవాసదీక్షను అవలంబించే ముస్లింలు దీక్ష విరమణ సమయంలో అత్యంత ఇష్టంగా సేవించే పానీయం ‘ఆష్’ (గంజి). ఉపవాసదీక్ష పరులకు ఈ వంటకం చాలా ప్రత్యేకమైంది. స్థానిక బెంగళూరు బస్టాండు వద్దనున్న జామియా మసీదు వద్ద రోజూ పెద్ద గంగాళాల్లో వండించి, ఇఫ్తార్ సమయంలో ఉచితంగా పంపిణీ చేస్తారు. ఈ పానీయాన్ని ఆష్ అని పిలుస్తారు. ముస్లింలే కాకుండా అందరూ ఈ పానీయాన్ని ఇష్టపడతారు. ఇఫ్తార్ కోసం దీనిని పవిత్ర వంటకంగా భావించి ప్రతి ఒక్కరూ తీసుకునేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. మదనపల్లెలోని జామియా మసీదు వద్ద గంజి పంపిణీ శుక్రవారం నుంచి ప్రారంభించారు.
ఇలా తయారు చేసుకోవచ్చు..
ముందుగా నెయ్యిని వేడి చేసుకుని దానిలో బొంబాయి రవ్వను వేయించుకుని చెక్క, లవంగాలు వంటివి వేసి రుచికరంగా తయారు చేస్తారు. పొంగుతున్న దశలో దించుకోవాలి. ఆష్‌ను వేడిగానే సేవించాలి. ఆష్‌ను సేవించడం వల్ల తక్షణం శక్తి వస్తుందని, జీర్ణక్రియ వేగవంతం అవుతుందని, ఆకలి పెరుగుతుందని పెద్దలు చెబుతారు. అందువల్లనే ఇఫ్తార్ సమయంలో ఖర్జురాలతోపాటు దీన్ని కూడా సేవిస్తారు.
28 ఏళ్లుగా ఉచితంగా పంపిణీ
రంజాన్ మాసం ప్రారంభం రోజు నుంచి ఉపవాసాలు పూర్తయ్యే వరకు గంజి పంపిణీ నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు సాయంత్రం మసీదు వద్ద ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. సుమారు వెయ్యి మంది నుంచి 1500 మంది ఉపవాసదీక్షపరులకు ఉచితంగా గంజిని పంపిణీ చేస్తున్నారు. 28 ఏళ్లుగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు.
ఉపవాస దీక్ష విరమణకు
ప్రత్యేకంగా పంపిణీ
పవిత్ర వంటకంగా భావిస్తున్న ముస్లింలు
28 ఏళ్లుగా పెద్దమసీదు వద్ద
ఉచితంగా వితరణ
