ములకలచెరువు : ములకలచెరువు పోలీస్‌స్టేషన్‌లో సోమవారం బాలిక అదృశ్యం కేసు నమోదైంది. ఎస్‌ఐ డీవై స్వామి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం తాతన్నగారిపల్లెకు చెందిన మేకల రామాంజులు కుమార్తె(15) ములకలచెరువు జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. శనివారం ఎప్పటిలాగే స్కూల్‌కు బయల్దేరి వెళ్లింది. రాత్రి గడిచినా ఇంటికి తిరిగి రాకపోవడంతో బంధువులు, స్వేహితుల ఊర్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. స్కూల్ హెచ్‌ఎం వద్దకు వెళ్లి విచారణ చేస్తే.. స్కూల్‌కు రాలేదని సమాధానం ఇచ్చారు. దీంతో మేకల రామాంజులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ లభిస్తే 9440900715 ఫోన్ నంబరుకు సమాచారం అందించాలని ఎస్‌ఐ కోరారు.
గాయపడ్డ వ్యక్తి మృతి
కలికిరి : మండల పరిధిలోని కలికిరి–కలకడ మా ర్గం పాళెం కురవపల్లి బస్టాప్ సమీపంలో ఈ నెల 22న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి చెందాడు. ఎస్.ఎహసాన్(35) తిరుపతిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య షేక్ అమ్మాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హెడ్‌కానిస్టేబుల్ కొండప్ప తెలిపారు.