
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తున్న వేదపండితులు
వాల్మీకిపురం: వాల్మీకిపురంలో వెలసిన పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అంకురార్పణ నిర్వహించారు. ఉదయం సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చణ, మొదటి గంట, బలి, శాత్తుమొర తదితర సేవలను జరిపారు. సాయంత్రం ఆలయంలో కలశస్థాపన, హోమాది కార్యక్రమాల అనంతరం అంకురార్పణ చేపట్టారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు రామ భక్తులు శ్రీరామ దీక్ష వ్రతమాలను ధరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, సూపరింటెండెంట్ మునిచెంగల్రాయులు, అర్చకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు, ఆలయ అధికారులు క్రిష్ణమూర్తి, దుశ్యంత్ కుమార్, నాగరాజు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
● పట్టాభిరాముడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉదయం ధ్వజారోహణం, ఊంజల్ సేవ, రాత్రి గజ వాహన సేవ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.