
రాయచోటి/రాయచోటి టౌన్/సంబేపల్లె: విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మక విద్య అందించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విద్యా విధానాన్ని సక్రమంగా అందించాలని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్ ఉపాధ్యాయులను ఆదేశించారు. శనివారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, కో ఆపరేటివ్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక, ఆదర్శ పాఠశాలలను ఆయన జిల్లా జేసీ తమీమ్ అన్సారియాతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రాయచోటిలోని నేతాజీ సర్కిల్ వద్ద ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాడు–నేడు పనులు పరిశీలించి పనుల ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.అనంతరం రాయచోటి కో–ఆపరేటివ్ కాలనీలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా నిల్వ ఉంచిన కోడిగుడ్లు, చిక్కీల్లో క్వాలిటీ, ఎక్‌పైరీ డేట్‌లను పరిశీలించారు. స్వయంగా విద్యార్థికి గోరుముద్దను తినిపించి ఆయన రుచిచూశారు.అంతకు ముందు 98 డీఎస్సీ క్వాలిఫైడ్ సంఘం నాయకులు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌ను రాయచోటిలో కలిశారు.కాంట్రాక్టు టీచర్లుగా నియమాంకం కోసం జీవో ఇచ్చినందుకు ఆయనకు కృత/్ఞతలు తెలియచేశారు సంబేపల్లె జిల్లాపరిషత్‌ఉన్నత పాఠశాలను కూడా ఆయన తనిఖీ చేశారు.బోధనలో అశ్రద్ధ చూపొద్దని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో డీఈఓ పురుషోత్తం, డిప్యూటీ డీఈఓ వరలక్ష్మి, ఎంఈఓ రమాదేవి, తహసీల్దార్ ప్రేమంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.