
తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుమల పోటు కార్మికుల సమస్యలపై త్వరలోనే చర్చించి పరిష్కరిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తిరుపతిలోని పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఆంధ్ర రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. వైవీ మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రతి గుడిలో ధూప, దీప నైవేద్యాల కోసం నిధులు మంజూరు వైఎస్సార్ హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు.
బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ..రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని కాపాడుతోన్న వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. బ్రాహ్మణులందరూ కలసికట్టుగా రానున్న ఉప ఎన్నికలో వైఎస్ జగన్ నిలబెట్టిన ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు.