చంద్రబాబుకు ఆచరణాత్మక ధోరణి లేదు: వైఎస్ జ‌గ‌న్‌ | YS Jagan press meet highlights | Sakshi
Sakshi News home page

రాజధానిలో చంద్రబాబు దోపిడీ: వైఎస్ జ‌గ‌న్‌

Apr 1 2026 10:36 AM | Updated on Apr 1 2026 2:04 PM

YS Jagan press meet highlights

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ (ఏప్రిల్‌ 1) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యా­ల­యంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. అమరావతి పేరుతో టీడీపీ చేస్తున్న అవినీతిని ఆయన ఎండగట్టారు. తాము అమరావతితో సహా ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. దేశంలో అతిపెద్ద స్కామ్‌కు అమరావతి క్యాపిటల్‌గా మారిందని ఆరోపించారు. చంద్రబాబు కేవలం తన స్కాముల కోసం భావోద్వేగాలు రెచ్చగొడుతున్నార‌ని విమ‌ర్శించారు. రాజధాని విషయంలోనే కాదు, ఏ విషయంలో కూడా చంద్రబాబులో ఆచరణాత్మక ధోరణి, ప్రాక్టికాలిటీ అనేది కనిపించదని.. అది ఉండి ఉంటే, ఇప్పటికే రాజధాని అనేది పూర్తయ్యేదన్నారు. రాజధానిలో చంద్రబాబు దోపిడీ మొత్తం బయటకు వస్తుందని, ప్రతి పనిలో ఎంత మెక్కిందీ కూడా బ‌హిర్గ‌తం అవుతుంద‌న్నారు. 

వైఎస్‌ జగన్‌ మీడియా సమావేశంలోని హైలైట్స్‌ ఇవే..

ప్రశ్నించకూడదట, అడగకూడదట..

  • అసెంబ్లీ, హైకోర్టు భవనాల్లోనూ చంద్రబాబు హైలెవల్‌ కరప్షన్‌
  • అమరావతిలో రోడ్లైనా, మురుగునీటి కాల్వలైనా, సీవరేజీ ప్లాంట్లైనా.. 
  • కొండవాటి వరద మళ్లింపు పనైనా ఇలా ఏది చూసినా అవినీతే
  • కేవలం సచివాలయం టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ డిజైన్లకోసమే రూ.401 కోట్లు పెడుతున్నారు
  • ఫ్లైఓవర్‌ కోసమే కిలోమీటర్‌కు రూ.170 కోట్లు పెడుతున్నారు
  • మా హయాంలో విజయవాడలో బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌కు కి.మీ.రూ.35 కోట్లు పెట్టారు
  • మిగిలిపోయిన సిక్స్‌ లేన్‌ రోడ్డుకు అమరావతిలో రూ.53 కోట్లు పెడుతున్నారు
  • నేషనల్‌ హైవేల్లో సిక్స్‌ లేన్‌ కోసం సగటు ఖర్చు రూ.20 కోట్లు మాత్రమే
  • ఈ దోపిడీని మనం ప్రశ్నించకూడదట, అడగకూడదట 
  • అడిగితే ఎదురుదాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు
  • అమరావతికి వ్యతిరేకం అని ఎదురుదాడి చేస్తున్నారు 


ఇక మంచి ఎలా జరుగుతుంది? 

  • చంద్రబాబు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలు మోసాలుగా మిగిలిపోయాయి 
  • ఇక చంద్రబాబు లక్ష ఎకరాల అమరావతికి రూ.2 లక్షల కోట్లు ఎప్పుడు పెట్టగలుగుతాడు?
  • ప్రజలకు ప్రభుత్వం తప్పనిసరిగా, బాధ్యతగా చేయాల్సిన మంచి ఎలా జరుగుతుంది? 
  • ఉద్యోగస్తులకు రూ.36 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి
  • అమరావతిలో భయంకరమైన అవినీతి, దోపిడీ జరుగుతోంది
  • 2018 లో ఏ పనులు, ఎవరు చేశారో.. 2024లో టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్లీ అవే కంపెనీలకు పనులు
  • అమరావతి టెండర్లలో గూడుపుఠాణీ జరిగింది? మాఫియాగా ఏర్పడ్డారు
  • ఒకవైపున అనూహ్యంగా రేట్లు పెంచి, మరో వైపున టెండర్లు రిగ్‌ చేశారు
  • ల్యాండు ఫ్రీ, ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, జీఎస్టీ మినహాయింపు
  • సీనరేజీ మినహాయింపు, ఎన్‌ఏసీ మినహాయింపు ఇస్తున్నారు 
  • ప్రజల రాజధాని సంగతి దేవుడెరుగు.. అతిపెద్ద స్కాంకు, కరప్షన్‌కు చంద్రబాబు నిజంగానే క్యాపిటల్‌ చేసేశాడు 
     

మా పథకాలన్నీ ఆగిపోయాయి..

  • స్కాముల కోసం అమరావతి మీద చంద్రబాబు అప్పులు
  • అప్పులు తెచ్చి కుమ్మరించడం వల్ల దాని ప్రభావం ఇప్పటికే స్టార్ట్‌ అయ్యింది
  • నాడు-నేడు ఆగిపోయింది, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతిదీవెన ఆగిపోయాయి
  • ఆరోగ్య శ్రీ ఆగిపోయింది, వ్యవసాయం దెబ్బతింది
  • మెడికల్‌ కాలేజీలు ఆగిపోయాయి, మా పథకాలన్నీ ఆగిపోయాయి
  • రాష్ట్రానికి అవసరమైన ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు ఆగిపోయాయి
     

వైఎస్సార్‌సీపీ ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదు

  • చంద్రబాబు ఈ 12 ఏళ్ల కాలంలో మనస్ఫూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నారా? 
  • ఇప్పటికీ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌ కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి? 
  • ఇప్పుడు కూడా ౩ ప్రత్యేక విమానాల్లో షటిల్‌ సర్వీసు చేస్తున్నారు
  • వైఎస్సార్‌సీపీ అమరావతి ప్రాంతానికే కాదు, ఏ ప్రాంతానికీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు

    ప్రజలను మభ్యపెట్టేలా చంద్రబాబు బిల్డప్‌
  • 50 వేల ఎకరాల్లో వరల్డ్‌లోనే బెస్ట్‌ క్యాపిటల్‌ అన్నారు
  • ఇప్పుడు మున్సిపాల్టీగానే మిగిలిపోతుందని ఎందుకు అంటున్నారు?
  • ఎక్కడా లేని విధంగా కాస్ట్‌ పేర్‌ స్క్వేర్‌ ఫీట్‌ పెరిగింది
  • ఏకంగా రూ.11 వేల నుంచి రూ.14 వేలు ఎందుకు పెరిగింది?
  • వీటికి అసెంబ్లీలో చంద్రబాబు సమాధానం చెప్పాడా?
  • కేవలం జగన్‌ను, వైఎస్సార్‌సీపీ దుమ్మెత్తి పోయడానికి అసెంబ్లీని వాడుకున్నారు
  • చట్టసభలో భాగమైన కౌన్సిల్‌ను పిలవలేదు
  • చంద్రబాబు అవినీతి బాగోతాన్ని కౌన్సిల్‌లో బయటపెడతారని పిలవలేదు
  • ఏ చట్టాన్నైనా చట్టసభలు తయారు చేయగలవు
  • ఆ చట్టాలను చట్టసభలు సవరించగలవు.. ఇది వాస్తవం
  • ప్రజలను మభ్యపెట్టేలా చంద్రబాబు మాట్లాడుతూ బిల్డప్‌ ఇస్తున్నారు
  • అవినీతి నుంచి డైవర్ట్‌ చేయడానికే ఈ డ్రామాలు

LIVE: YS జగన్ కీలక ప్రెస్ మీట్

ఎన్ని దశాబ్దాలు పడుతుంది?

  • భూములు ఇచ్చిన రైతులకు చెప్పిన హామీలైనా నెరవేర్చారా? 
  • మొదట తీసుకున్న 50 వేల ఎకరాలకే దిక్కు లేదు
  • ఇందులో రోడ్లు, కరెంటు, వాటర్‌, డ్రైనేజీ కల్పనకే ఖర్చు రూ.లక్ష  కోట్లు
  • ఇప్పుడు సడన్‌గా మరో 50 వేల ఎకరాలు ఎందుకు పెంచారు?
  • సడన్‌గా మాస్టర్‌ ప్లాన్‌ను ఎందుకు మారుస్తున్నారు?
  • దీనివల్ల అదనంగా మరో రూ.లక్ష కోట్లు పెరిగింది
  • మరి ఈ డబ్బు పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది?
  • ఎన్ని దశాబ్దాలు పడుతుంది? 

అసెంబ్లీలో చంద్రబాబు చేసిన డ్రామా ఇది..

  • రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదన్నారు
  • స్వయంగా మంత్రి పార్థసారథి ఈ విషయం చెప్పారు
  • అమరావతిపై శాసనసభలో తీర్మానం చేశారు
  • రాజధాని పేరిట చేస్తున్న దోపిడీ నుంచి పక్కదోవ పట్టించడానికే తీర్మానం
  • రాజధాని పేరిట పట్టపగలు దోపిడీ: 
  • అసెంబ్లీలో చంద్రబాబు చేసిన డ్రామా ఇది
  • రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు
  • సీట్స్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ మాత్రమే ఉంది
  • ఈ వాస్తవాన్ని ఎవ్వరూ మరిచిపోవద్దు
  • లక్ష ఎకరాల అమరావతిలో ఇంతవరకూ కట్టింది ఎంత?
  • నిజంగా అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్ట్‌ అయ్యిందా?

రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి?

  • అమరావతిలో రోడ్లు, డ్రైనేజీలకే ఎకరానికి రూ.2 కోట్లు అవుతుంది
  • చంద్రబాబు లెక్కలే ఈ వివరాలు చెబుతున్నాయి
  • ఆ లెక్కన లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లు కావాలి
  • రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి?
  • ఈ రూ.2 లక్షల కోట్లు ఇంకా పెరుగుతూనే పోతాయి
  • 2019 ముందు మాస్టర్‌ప్లాన్‌ ఎందుకు మార్చుతున్నారు
  • ఒకప్పుడు వరల్డ్‌ క్లాస్‌ సిటీ అని చంద్రబాబు ఊదరగొట్టారు
  • ఇప్పుడు మున్సిపాలిటీగా మిగిలిపోతుందని ఎందుకు అంటున్నారు?

రోడ్లు, డ్రైనేజీలకే ఎకరానికి రూ.2 కోట్లు

  • ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాజధానులను కేంద్రం నిర్ణయించలేదు
  • ఆయా రాష్ట్రాలే రాజధానులను నిర్ణయించుకున్నాయి
  • ఏడేళ్లు సీఎంగా ఉండి అమరావతిలో చంద్రబాబు చేసిందేంటి?
  • భూములిచ్చిన రైతుల హామీలు నెరవేర్చారా?
  • అమరావతిని ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు?

అమరావతిపై వాస్తవాలు తెలియాలి

  • చంద్రబాబు సీఎంగా ఉండడం ఏపీ ప్రజల దురదృష్టం
  • శాసనసభలో అమరావతిపై తీర్మానం ఒక డ్రామా
  • రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదమే లేదు
  • చంద్రబాబు దృష్టిలో పాలన అంటే దోపిడీ, అవినీతి
  • అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement