
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న వసతులపై వైద్య ఆరోగ్యశాఖ సర్వే నిర్వహించింది. మొత్తం 220 ఆస్ప త్రుల్లో 19 విభాగాలపై వసతులు ఎలా ఉన్నాయన్న దానిపై సర్వే నిర్వహిం చగా.. విశాఖ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 2,500 మార్కులకు గానూ 1,514.8 మార్కులు సాధించింది. 1502.2 మార్కులతో విజయనగరం రెండో స్థానంలో, 1,317 మార్కులతో అనంతపురం చివరి స్థానంలో నిలిచాయి. ఐసీయూ, ఆక్సిజన్ పడకలు, డిశ్చార్జీ, ఆహారం, పారిశుధ్యం, మౌలిక వసతులు, పడకలకు తగ్గ డాక్టర్లు ఇలా మొత్తం 19 విభాగాల్లో 2,500 మార్కులకు నిర్ణయించి ఆరా తీశారు. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రులూ ఉన్నాయి.