రేపు తిరుమల జూన్‌ నెల దర్శన కోటా విడుదల | Tirupati Darshan tickets release for june 2026 | Sakshi
Sakshi News home page

రేపు తిరుమల జూన్‌ నెల దర్శన కోటా విడుదల

Mar 17 2026 8:17 AM | Updated on Mar 17 2026 8:17 AM

 Tirupati Darshan tickets release for june 2026

తిరుమల: తిరుమలలో జూన్‌ నెలకు సంబంధించి శ్రీవారి దర్శనాల, గదుల కోటాను 18న టీటీడీ విడుదల చేయనుంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కోటాను మార్చి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎల్రక్టానిక్‌ డిప్‌ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

 ఈ టికెట్లు పొందిన వారు 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్లే టికెట్లు మంజూరవుతాయి. 21న ఆర్జి సేవా టికెట్లు, వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా, 23న అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటా, శ్రీవాణి ట్రస్ట్‌ దర్శన టికెట్ల కోటా, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇక 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, తిరుమల, తిరుపతిలో గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement