ఇండేన్‌ గ్యాస్‌ బుకింగ్‌కు దేశ వ్యాప్తంగా ఒకే నంబర్

Same number across the country for Indane gas bookings - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: నవంబర్‌ 1 నుంచి ఇండేన్‌ గ్యాస్‌ వినియోగదారులు దేశంలో ఎక్కడ నుంచి అయినా 7718955555 నంబర్‌ ద్వారానే బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుందని ఇండియన్‌ ఆయిల్‌ డీజీఎం (ఎల్‌పీజీ) ఎల్‌పీ ఫులిజిలే తెలిపారు. ఆయన విజయవాడలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. డీలర్ల వద్ద నమోదు చేసుకున్న ఫోన్‌ నంబర్ల నుంచి ఎస్‌ఎంఎస్‌ లేదా ఐవీఆర్‌ విధానంలో సిలిండర్‌ బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు.

మొబైల్‌ నంబర్లు నమోదు చేసుకోని వారు 16 అంకెల గ్యాస్‌ కనెక్షన్‌ నంబర్‌ నమోదు చేయడం ద్వారా బుక్‌ చేసుకోవాలన్నారు. అలాగే 75888 88824 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా రీఫిల్‌ బుక్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించినట్టు తెలిపారు. ఇండియన్‌ ఆయిల్‌ వన్‌ యాప్‌ ద్వారా కూడా గ్యాస్‌ బుకింగ్, ఆన్‌లైన్‌ పేమెంట్‌ సేవలు పొందవచ్చన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top