అమ్మ జన్మనిస్తే.. జగనన్న జీవితాన్నిచ్చారు: ఎమ్మెల్యే రోజా

MLA Roja Inspirational Speech Over Women Empowerment In AP Assembly  - Sakshi

సాక్షి, అమరావతి: మహిళలకు ప్రతి దశలోను ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రోజా అన్నారు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా..  మహిళా సాధికారతపై ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వం.. మహిళా పక్షపాతి ప్రభుత్వమని తెలిపారు. మహిళల కోసం ​ఇన్ని పథకాలు తెచ్చిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌ అని పేర్కొన్నారు. అదేవిధంగా.. మహిళల ఖాతాల్లోకి నగదు చేరేలా పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. 

దేశంలోనే గొప్ప పథకం అమ్మ ఒడి అని కొనియాడారు. రాష్ట్రంలో ఎంతమంది నాయకులున్నా.. జగనన్నకు సాటిరారని తెలిపారు. అమ్మ జన్మనిస్తే.. జగనన్న జీవితాన్నిచ్చాడని ఎమ్మెల్యే రోజా అన్నారు. మహిళల తలరాతను మార్చే పథకాలు అమలు చేస్తున్నారని రోజా పేర్కొన్నారు.  65 శాతం మంది మహిళలకు మున్సిపల్‌​ చైర్మన్ల పదవులు, ఎంపీపీ పదవుల్లో 53 శాతం మహిళలకే కేటాయించారని రోజా తెలిపారు.

చం‍ద్రబాబు మహిళా ద్రోహి అని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. కుప్పంలో చం‍ద్రబాబును ప్రజలు ఛీకొట్టారని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు ఆడవాళ్లను అవమాన పరిచారని రోజా గుర్తు చేశారు. 40 ఏళ్ల నుంచి బాబు.. ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు, లోకేష్‌ వీధి రౌడీల్లాగా వ్యవహరించారని, గల్లీ గల్లీ తిరిగినా ప్రజలు పట్టించుకోలేదన్నారు. తట్టాబుట్టా సర్దుకుని చంద్రబాబు,లోకేష్‌ హైదరాబాద్‌కు వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని రోజా సెటైర్లు వేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top